2019 ఎన్నిక‌ల బ‌రిలో ఎన్నారైలు!

Update: 2018-08-21 13:24 GMT
తెలంగాణ‌లో సీట్ల పందేరం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. గ‌త నాలుగేళ్లుగా పార్టీకి సేవ చేస్తూ....ఎమ్మెల్యే - ఎంపీ టిక్కెట్లు ఆశిస్తున్న వారు ఒక‌వైపు. పార్టీ టికెట్ సంపాదించ‌డం కోసం అంగ‌, అర్ధ‌బ‌లాల‌పే ఉప‌యోగించి..ఎత్తులుపై ఎత్తులు వేస్తున్న‌రు. అయితే, అవేమీ లేకండా ఎన్నారై అనే మిన‌హాయింపు కోటాలో సీట్లు సంపాదించాల‌ని భావిస్తోన్న ఎన్నారైలు మ‌రోవైపు. ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య సీట్ల లొల్లితో తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ - ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయ‌ట‌. ఓ ప‌క్క ఫ్ల‌యిట్ టికెట్ బుక్ చేసుకొని....ఇండియాలో ల్యాండ్ అయి తెలంగాణ‌లో పార్టీ టికెట్ పై క‌ర్జీప్ వేద్దామ‌ని ఎన్నారైలు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం, ఇప్ప‌టినుంచే సామాజిక కార్య‌క్ర‌మాలు కూడా మొద‌లుపెట్టార‌ట‌. దీంతో, త‌మ‌కు టికెట్ దక్క‌దేమోన‌ని ఆశావ‌హులు గుబులుప‌డుతున్నారు.

టీఆర్ ఎస్ నుంచి బ‌రిలోకి దిగేందుకు చాలామంది ఎన్నారైలు రెడీ అట‌. కోదాడ నుంచి బ‌రిలోకి దిగాల‌ని ఎన్నారై అప్పిరెడ్డి యోచిస్తున్నార‌ట‌. అమెరికాతోపాటు వివిధ దేశాల్లో క‌న్స‌ల్టెన్సీ సేవ‌లు అందిస్తోన్న అప్పిరెడ్డి గ‌ట్టిగానే ఖ‌ర్చు చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌. ఇక హుజ‌ర్ న‌గ‌ర్ నుంచి సైదిరెడ్డి పోటీ చేయ‌బోతున్నార‌ట‌. సాఫ్ట్ వేర్ కంపెనీ ఓన‌ర్ అయిన సైదిరెడ్డి గ‌ట్ట‌గానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. మెద‌క్ ఎంపీగా...కేసీఆర్ స‌న్నిహితుడు ప్ర‌వీణ్ రెడ్డి బరిలోకి దిగాల‌ని యోచిస్తున్నార‌ట‌. 2014లోనే ప్ర‌వీణ్ కు టికెట్ ఖాయం అని అనుకున్నా....ఆఖ‌రి నిమిషంలో కుద‌ర‌లేదు. జానారెడ్డిపై పోటీ చేసేందుకు ర‌వీంద‌ర్ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నార‌ట‌. అధికార ప‌క్షంతో పాటు కాంగ్రెస్ నుంచి కూడా ఎన్నారైలు టికెట్ ఆశిస్తున్నార‌ట‌. మిర్యాల‌గూడ‌లో పోరెడ్డి శ్ర‌వంత్ రెడ్డి  - నారాయ‌ణ్ ఖేడ్ లో కేసిరెడ్డి - పెద్ద‌ప‌ల్లిలో గొట్టిముక్క‌ల సురేష్ రెడ్డి - దేవ‌ర‌క‌ద్ర నుంచి ప‌వ‌న్  టికెట్ ఆశిస్తున్నార‌ట‌. మ‌రి, వీరిలో ఎంత‌మందికి టికెట్లు.. ద‌క్కుతాయ‌న్న సంగ‌తి పక్కన‌బెడితే....వ్యాపారాలు వ‌దిలి ప్ర‌జా సేవ చేయాల‌నుకోవ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం.

Tags:    

Similar News