రాంగ్ టైంలో ఈ ట్రిప్ ఏమిటి తారక్?

Update: 2021-11-21 15:30 GMT
అన్ని సందర్భాల్లో కాకున్నా.. కొన్ని సందర్భాల్లో కొన్ని పనుల్ని అస్సలు చేయకూడదు. దాని కారణంగా కొంత నష్టపోయినా ఫర్లేదు.. అలాంటి వాటికి దూరంగా ఉండటం చాలా అవసరం. తాజాగా అలాంటి పని చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది తారక్ విషయంలో. ఒకపక్క తన తండ్రి సోదరిని ఉద్దేశించి దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన వైసీపీ తీరుపై నందమూరి ఫ్యామిలీ మొత్తం తీవ్ర ఆగ్రహంతో ఉందన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే నందమూరి కుటుంబంలోని వారంతా కలిసి.. ఒకేచోట మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఇందుకు భిన్నంగా.. తన ఇంటి ఆవరణలో ఒక సెల్ఫీ వీడియోలో.. నారా భువనేశ్వరి మీద చేశారని చెబుతున్న వ్యాఖ్యల్ని ఖండించారు తారక్. అయితే..ఈ ఖండించిన తీరు కూడా ఏదో అన్నట్లుగా ఉందే తప్పించి.. ఆయన్ను అభిమానించే అభిమానులు కానీ.. టీడీపీ సానుభూతిపరులు.. కార్యకర్తలను శాటిస్ ఫై చేయలేకపోయిందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన స్విట్జర్లాండ్ ట్రిప్ నకు బయలుదేరారు.

ఈ రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో తారక్.. ఆయన సతీమణి ప్రణతి.. పిల్లలు అభయ్ రామ్.. భార్గవ్ రామ్ లతో కలిసి స్విస్ ట్రిప్ నకు బయలుదేరారు. గడిచినకొంతకాలంగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి తీవ్రంగా శ్రమించిన తారక్.. ఆటవిడుపుగా స్విస్ టూర్ కు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.

అంతా బాగానే ఉంది కానీ.. తన కుటుంబానికి సంబంధించిన వారి విషయంలో రాజకీయ రచ్చ ఒక స్థాయిలో జరుగుతున్న వేళ.. హాలీడే ట్రిప్ కు సకుటుంబ సమేతంగా వెళుతున్న వైనం తారక్ కు మైనస్ గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి రైట్ ట్రిప్ అయినప్పటికీ.. రాంగ్ టైం లో వెళ్లటం ఆయనకు నష్టం వాటిల్లేలా చేస్తుందన్న టాక్ పలువురి నోటి నుంచి వినిపిస్తుండటం గమనార్హం.
Tags:    

Similar News