ఏపీలో తీవ్ర కలకలానికి.. తీవ్ర ఉద్రిక్తతలకు.. దారి తీసిన విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ప్రదాన ప్రతిపక్షం తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అదేవిధంగా ఆందోళనలకు కూడా పిలుపునిస్తున్నట్టు టీడీపీ సభ్యులు తెలిపారు. అయితే.. ఈ క్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ.. బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా.. ఆమెమాట్లాడుతూ.. ఎన్టీఆర్ పట్ల చంద్రబాబుకు గౌరవం లేదన్నారు.
ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ పేరు తీసేస్తామని బాబే చెప్పారన్నారు. "ఎన్టీఆర్ అవసరం లేదని చంద్రబాబే చెప్పారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. వైఎస్సార్ గొప్ప మానవతావాది. కేంద్రంతో టీడీపీకి పొత్తు ఉన్నప్పుడు ఏపీకి ఏం చేశారు?. రాష్ట్ర ప్రజలు బాగుపడటం టీడీపీకి ఇష్టం లేదు" అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ పేరును ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరించారు. వ్యక్తిగతంగా వైఎస్ డాక్టర్ అని పేర్కొన్నారు.
నిజానికి.. ఎన్టీఆర్ స్వతహాగా వైద్యుడు కారని.. మంత్రి పేర్కొన్నారు. కానీ, వైఎస్ వైద్య వృత్తిని ఎంచుకుని .. చదివారని అనంతరం.. ఆయన సొంత డిస్పెన్సరీ పెట్టుకుని.. కడప జిల్లా ప్రజలకు ఉచితంగానే వైద్యం అందించారని.. రజనీ వివరించారు. అంతేకాదు..పులివెందులలో 'రూపాయి డాక్టర్'గా వైఎస్ పేరు తెచ్చుకున్నారని చెప్పారు. అనంతరం .. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. కూడా.. వైఎస్ ఈ వైద్య వృత్తిని వదిలి పెట్టలేదన్నారు.
ఆయనకు వైద్య వృత్తి పట్ల ఎంతో నిబద్ధత ఉందన్నారు. తన హయాంలో 3 వైద్య కాలేజీలు తీసుకువ చ్చారని.. తెలిపారు. అదేసమయంలో ఆయన హయాంలో 104, 108 వంటి వాహనాలు.. తీసుకువచ్చారని పేర్కొన్నారు. అదేసమయంలో పేదలకు.. ఉచిత వైద్యం అందించేలా.. ఆరోగ్య శ్రీ తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ పేరును పక్కన పెట్టి.. వైఎస్సార్ పేరు పెడుతున్నట్టు ప్రభుత్వం తరఫున మంత్రి వివరణ ఇచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.