హిమాలయాలకు ఎసరు..భారత్ ఆందోళన?

Update: 2018-08-12 06:31 GMT
చైనా అణు పరీక్షల గుట్టుపై నిఘా వేయడానికి భారత్-అమెరికా చేసిన రహస్య పని ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టింది. 1964వ సంవత్సరంలో చైనా అణు పరీక్షలు జరిపి ప్రపంచానికి షాక్ ఇచ్చింది. ఈ చైనా అణుపాఠవం తెలుసుకోవడానికి అమెరికా... భారత్ సహకారం కోరింది. భారత ఐబీ - అమెరికా సీఐఏలు కలిసి రహస్యంగా చైనా శివారులోని హిమాలయాల్లో ఉన్న నందాదేవి పర్వత శ్రేణుల వద్ద నిఘా పెట్టాడానికి ఫ్లుటోనియం క్యాప్సుల్ - ఏంటెనాలు - అణు ఇంధనంతో నడిచే జనరేటర్ ను 1965 జూన్ 23న ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అక్టోబర్ లో ఈ పర్వత శ్రేణి వద్దకు వెళ్లి చూడగా వాతావరణం అనుకూలించలేదు. విపరీతమైన మంచుతో అమెరికా-భారత నిపుణులు వెళ్లలేకపోయారు. ఆ తర్వాత నందాదేవి పర్వతానికి వెళ్లి చూడగా.. ఈ రహస్య పరికరాలు లేవు. మంచులో కూరుకుపోయాయి. వాటిని అలాగే వదిలేస్తే అణు విస్ఫోటనం జరిగి చాలా నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఆ నీరు గంగానదిలో కలిస్తే పెద్ద ఎత్తున ప్రజలు - జంతువులు చనిపోతారు.

1966 - 67లో మరోసారి వెళ్లినా ఈ అణు పరికరాలు లభ్యం కాలేదు. కేవలం 100 ఏళ్లు మాత్రమే ఈ అణు ఇంధనం కరగదు.. ఆ లోపే వాటిని కనిపెట్టాలి. లేకపోతే అణు విస్ఫోటనం అయ్యి కరిగిపోయి పెద్ద ఎత్తున ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. రేడియో ధార్మికత కూడా వెలువడి వినాశనం తప్పదు. ఆ నీరు గంగానదిలో కలిస్తే ఉత్తరాఖండ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఉన్న జలాలు కలుషితమై ప్రాణాలు పోతాయి. రేడియేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. దీంతో   ఈ పరికరాలు మంచులో ఎక్కడున్నాయనేది మిస్టరీగా మారింది.

ప్లుటోనియం క్యాప్సూల్స్‌ ఒకవేళ కరిగిపోయి రిషి గంగలో కలిస్తే పవిత్ర జలాలన్నీ కలుషితమైపోతాయి. ఆ నీటిని వినియోగిస్తే ఎందరో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఉత్తరాఖండ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌ వరకు ఉన్న ప్రజలు రేడియేషన్‌ బారినపడే అవకాశం ఉంది.

స్మోక్‌ సిగ్నల్స్ - హోమ్‌ ఎలోన్‌ వంటి చిత్రాలను నిర్మించిన హాలీవుడ్‌ నిర్మాత స్కాట్‌ రోజెన్‌ ఫెల్ట్‌ ని ఈ సీక్రెట్‌ మిషన్‌ విపరీతంగా ఆకర్షించింది. కెప్టెన్‌ కోహ్లి ఈ ఆపరేషన్‌ పై స్పైస్‌ ఇన్‌ హిమాలయాస్‌ పేరుతో చాలా ఏళ్ల కిందటే ఒక పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకం హక్కుల్ని రోజెన్‌ ఫెల్ట్‌ పదేళ్ల క్రితమే కొనుగోలు చేశారు. కానీ బడ్జెట్‌ సరిపోక ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు మలబెర్రి ఫిలిమ్స్ - రోజెన్‌ ఫెల్ట్‌ సంయుక్తంగా 2 కోట్ల డాలర్ల భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సీక్రెట్‌ ఆపరేషన్‌ లో పాల్గొన్న పలువురిని రోజెన్‌ ఫెల్ట్‌ కలసి వారు చెప్పిన అనుభవాలతో ఆపరేషన్‌ నందాదేవిని తెరకెక్కించనున్నారు. భారత్‌ సిబ్బంది పాత్రల్లో భారతీయులనే తీసుకోనున్నారు. కెప్టెన్‌ కోహ్లి పాత్రకు రణబీర్‌ ను సంప్రదించినట్టు సమాచారం.
Tags:    

Similar News