నిన్నటి వరకూ ఇద్దరూ ఒకే గూటికింద పక్షులుగా ఉన్న వారే. కాలం తెచ్చిన పరిణామాలతో భిన్నధ్రువాలుగా మారి..ఒకరిపై ఒకరు విమర్శలు.. ఆరోపణలు చేసుకుంటూ తమిళనాడురాజకీయాల్ని హీటెక్కిస్తున్న వైనం తెలిసిందే. తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పన్నీర్ సెల్వం ఓపక్క.. తమిళనాడు అధికారపార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న చిన్నమ్మ మరో పక్క కావటంతో రెండు గ్రూపులతో తమిళనాడు మొత్తం రాజకీయ గందరగోళంలో చిక్కుకుపోయిందని చెప్పాలి.
ఒకరిపై ఒకరు విమర్శలు.. ఆరోపణలు చేసుకుంటున్న ఈ ఇద్దరి మాటలన్నీ ‘అమ్మ’ కేంద్రంగా సాగటం విశేషంగా చెప్పాలి. ముందుగా పన్నీరు సంధిస్తున్న మాటల అస్త్రాల్ని చూస్తే.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేర్చిన అమ్మకు జరిగిన చికిత్స ఏమిటి? 75 రోజుల పాటు అపోలో వైద్యులు అందించిన చికిత్స అంశాలతో పాటు.. అమ్మ మరణంపై వెల్లువెత్తుతున్న సందేహాల్ని తెరపైకి తీసుకురావటం ద్వారా.. అమ్మకు ఏదో జరిగిందన్న భావన ప్రజల్లో మరింత పెంచేలా చేశారని చెప్పాలి. మంగళవారం రాత్రి మెరీనా బీచ్ వద్దకు చేరుకున్న పన్నీర్.. అమ్మ స్మారకం వద్ద ధ్యానం చేయటం.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ ఆత్మ తనతో మాట్లాడిందని.. జరిగిన విషయాల్ని ప్రజలకు చెప్పాలని ఆదేశించిందంటూ చెప్పటం ద్వారా అమ్మ సెంట్రిక్ గానే పన్నీర్ పావులు కదపటం కనిపిస్తుంది.
ఈ రోజు మొత్తం జరిగిన పరిణామాలు చూస్తే.. అమ్మకు ఏదో అన్యాయం జరిగిందన్న భావనను కలిగించటంలో పన్నీర్ సక్సెస్ కావటమే కాదు.. ఆసుపత్రిలో ఉన్న అమ్మను చూసేందుకు ప్రతిరోజూ మూడు పూటలా వెళ్లినా.. తనను అమ్మ వద్దకు అనుమతించని కొత్త విషయాన్ని పన్నీర్ బయటపెట్టారు. మరోవైపు.. పన్నీర్ కు కౌంటర్ మీద కౌంటర్ ఇస్తున్న చిన్నమ్మ సైతం.. అమ్మ జపాన్నే జపిస్తున్నారు.
పన్నీర్ సంధించిన ప్రశ్నల్ని అస్సలు ప్రస్తావించని చిన్నమ్మ.. కుట్రలు అన్నాడీఎంకే పార్టీకి కొత్త కాదని.. ఇలాంటివి తాను ఎన్నో చూశానని.. గతంలో మాదిరి ఈ కుట్రల్ని తాను చేధించనున్నట్లుగా పేర్కొన్నారు. తనపై విమర్శలు చేస్తున్న పన్నీర్ ను ద్రోహిగా వ్యాఖ్యానించిన ఆమె.. పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేల్నిఉద్దేశించి భావోద్వేగంతో ప్రసంగిస్తూ.. అమ్మ ముచ్చట్లతోనే నింపేయటం గమనార్హం. అమ్మను ఎవరైతే ప్రేమిస్తారో.. అభిమానిస్తారో.. వారంతా తనతోనే ఉంటారని మాట అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై తిరుగులేని అస్త్రంగా మారిందని చెబుతున్నారు. మొత్తానికి కత్తులు నూరుకుంటున్న ఇరువురు నేతలూ అమ్మ జపంతోనే పోరాడుకోవడం ఆసక్తికరమైన అంశంగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/