చిన్నమ్మకు మరీ అంత తొందరా?

Update: 2017-02-08 04:50 GMT
కొన్ని మాటల ప్రభావం చాలా ఎక్కువ. గంటల గంటలు చెప్పుకొన్నా.. ఒక చిన్న మాటతో మొత్తం ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. తాజాగా తమిళనాడు చిన్నమ్మ శశికళ ఇమేజ్ ను అదే తీరులో బర్ బాత్ చేసేశారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం. సీఎం కుర్చీలో కూర్చునేందుకు ఆమెకున్న తహతహను చెప్పేసిన ఆయన.. అమ్మ గురించి ఎవరూ ఆలోచించని కోణాన్నిఅందరికంటే ముందుగా ఆమే ఆలోచించిందన్న మాటను చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అమ్మ చికిత్స పొందుతున్న వేళ.. అమ్మకు నెచ్చెలిగా ఉన్న శశికళ తనతో రెండుసార్లు.. ‘‘అమ్మకు ఏమైనా జరిగితే పార్టీని.. ప్రభుత్వాన్ని ఎలా నడపాలి?’’ అని శశికళ తనతో చర్చకు తెచ్చారన్నారు. తాను ఆ సమయంలో ఆ చర్చను వారిస్తూ.. అలాంటి అంశాలు ఇప్పుడు చర్చించాల్సిన అవసరం ఏముందంటూ వారించినట్లు చెప్పారు.

పన్నీరు సెల్వం మాటల్ని విన్నప్పడు.. ఆసుపత్రిలో అమ్మ చికిత్స పొందుతున్న వేళలోనే శశికళ పార్టీ గురించి.. ప్రభుత్వాన్ని నడిపే అంశం గురించి ఎందుకుఆలోచన వచ్చింది? అన్న ప్రశ్నతోపాటు.. అమ్మకు జరగరానిది ఏదో జరిగిపోతుందన్న భావన ఎందుకు వచ్చిందన్నప్రశ్నలు వచ్చేలా పన్నీరు మాటలు ఉండటం గమనార్హం.

అమ్మ ఆరోగ్యం కుదుట పడుతుందని.. ఆమె తిరిగి క్షేమంగా వచ్చేస్తారంటూమాటలు వినిపించిన వేళ.. అందుకుభిన్నంగా శశికళ మాటలు ఉన్నాయన్న భావన కలిగేలా పన్నీర్ మాటలు ఉండటాన్ని మర్చిపోకూడదు. మాటల మధ్యలో చెబుతున్నట్లుగా చెప్పినా.. శశికళకు అధికారం మీద ఉన్నకాంక్షను విమర్శించకుండానే అందరికి అర్థమయ్యేలా చెప్పటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. నాలుగు తిట్లు తిట్టేయకుండా.. ఒక చిన్నఉదాహరణతో చిన్నమ్మ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేశారని చెప్పక తప్పదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News