పురిచ్చితలైవి జయలలిత మరణంలో అధికార ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలంతా అమ్మ వారసుడిగా ఓ పన్నీర్ సెల్వంను ప్రకటిస్తూ డిక్లరేషన్ పై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. దీనికితోడు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట కజగం (అన్నాడీఎంకే) భవితవ్యంపై పార్టీ సీనియర్లు సోమవారం ఉదయం సమావేశమై అమ్మకు వారసుడు పన్నీర్ సెల్వం మాత్రమేనని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే అమ్మకు వీరవిధేయుడు అయిన పన్నీర్ సెల్వం వ్యక్తిగత జీవితం అత్యంత ఆసక్తికరం.
పన్నీర్ సెల్వం దక్షిణాది తమిళనాడులో బలమైన థేవార్స్ - మారవార్ సామాజిక వర్గానికి చెందిన వారు. థేనీజిల్లాలోని పెరియాకులంలో 1970వ దశకంలో స్నేహితుడు విజయన్ తో కలిసి రోజీ క్యాంటిన్ పేరిట టీ షాప్ ప్రారంభించారు. దీన్ని పీవీ క్యాంటిన్ అని కూడా పిలిచేవారు. 1980వ దశకం చివరిలో తన సోదరుడు ఓ రాజాకు పీవీ క్యాంటిన్ అప్పగించిన పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎంజీఆర్ కు అభిమాని. ఎంజీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత పన్నీర్ సెల్వం పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చారు. 1987లో ఎంజీఆర్ మృతి తర్వాత రెండు చీలిన అన్నాడీఎంకేలో తొలుత జాన కీ రామచంద్రన్ కు మద్దతు పలికారు. తర్వాత జయ కు మద్దతు తెలిపిన పన్నీర్ సెల్వం 1996లో పెరియాకులం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో అన్నాడీఎంకే పటిష్టంగా ఉండడానికి కారణం థేవార్ల మద్దతేనంటారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ తమిళనాడు నుంచి 10 స్థానాలకు అన్నాడీఎంకే విజయంలోనూ సెల్వందే కీలక పాత్ర. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో థేవార్ల మద్దతు కూడగట్టడంలో విజయం సాధించారు.
థేని జిల్లాలోని బోదినాయకన్నూర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పన్నీర్ సెల్వం.. గతంలో జయ లీగల్ కేసులను ఎదుర్కొంటున్నప్పుడు రెండుసార్లు (2001 సెప్టెంబర్ 21 నుంచి 2002 మార్చి ఒకటో తేదీ వరకు, 2014 సెప్టెంబర్ 29 నుంచి 2015 మే 22 వరకు) సీఎంగా పనిచేశారు. ఆయన సీఎంగా పనిచేసినా జయ పరోక్షంలోనూ ఆమె పట్ల విధేయత ప్రకటించారు. తాను రిమోట్ కంట్రోల్‌గానే పనిచేస్తానని స్వయంగా చెప్పారు. రెండోసారి సీఎంగా ప్రమాణంచేసినప్పుడు కన్నీటి పర్యంతం కావడంతో ఆయనకు పన్నీర్ సెల్వం కాదు కన్నీర్ సెల్వం అని అభిమానులు నిక్ నేమ్ పెట్టారు. గత మార్చిలో జయ క్యాబినెట్ లో ఆర్థిక - ప్రజా పనులశాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పన్నీర్ సెల్వం పలు శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. గత సెప్టెంబర్ 22న అనారోగ్యంతో అపోలో దవాఖానలో చేరిన జయ సుదీర్ఘ కాలం చికిత్స పొందాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమె సలహా మేరకే రాష్ట్ర ఇన్ చార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అక్టోబర్ 11న పన్నీర్ సెల్వంకు సీఎం శాఖలను అప్పగించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/