ప్రపంచానికి పెద్దగా.. శాసించే సత్తా అమెరికా అధ్యక్షుడి సొంతం. అంతటి శక్తివంతమైన వ్యక్తి.. కంట కన్నీరు ఒలకటం ప్రపంచ వ్యాప్తంగా వార్తగా మారింది. అయితే.. ఆయన కంట జారిన కన్నీరు తన దేశంలోని గన్ కల్చర్ కు వ్యతిరేకమన్న సంగతి తెలిసిందే. గన్ కల్చర్ కారణంగా అమాయక చిన్నారుల్ని గుర్తు చేసుకుంటూ ఒబామా కన్నీరు పెట్టుకోవటంతో ఇప్పుడా దేశంలో గన్ కల్చర్ మీద విస్తృత స్థాయిలో చర్చ సాగుతోంది.
తాను కన్నీరు పెట్టుకున్న విషయంలో తనకే ఆశ్చర్యంగా ఉందని ఒబామా వ్యాఖ్యానించారు. అయితే.. తాను వాస్తవికతో వ్యవహరించినట్లుగా చెప్పుకున్నారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో తన జీవితంలో అత్యంత చెత్త రోజు ఏదైనా ఉందంటే.. అది కనెక్టికట్ లో చిన్నారుల్ని పాశవికంగా చంపేసిన రోజే అని చెప్పుకొచ్చరు.
చిన్నపిల్లల్ని అత్యంత పాశవికంగా హత్య చేస్తున్న గన్ కల్చర్ మీద విపరీతమైన ఆందోళన వ్యక్తం చేసిన ఒబామా.. తన జీవితంలో ఎప్పుడు తాను గన్ పెట్టుకోలేదని చెప్పుకొచ్చారు. ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉండి కూడా.. తన దేశంలో విష వృక్షంగా మారిన గన్ కల్చర్ కు చెక్ చెప్పలేకపోవటం చూస్తే.. అమెరికాలో ఈ కల్చర్ ఏ స్థాయిలో ఉందో.. దీని వెనుక మార్కెట్ శక్తులు ఎంత బలంగా పని చేస్తున్నాయో ఇట్టే తెలుస్తుంది.