కర్ణాటక ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బిందువు - బిందువు సింధువుగా మారినట్లు.. చిన్న - చిన్న సామాజిక వర్గాల ఓట్లు గెలుపు - ఓటముల్లో - ప్రభుత్వం ఏర్పాటులో కీలకం కానున్నాయి. ఈ సత్యాన్ని గ్రహించిన రాజకీయ పార్టీలు చిన్న సామాజిక వర్గాల ఓట్లపై దృష్టి సారించాయి. వచ్చే నెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రధాన ఓటు బ్యాంకు అయిన ఓబీసీ ఓట్లపై పార్టీలు కన్ను వేశాయి. ఓబీసీలో వక్కళిగలు - కురుబలు - లింగాయతుల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ మిగిలిన ఉప కులాల ఓట్లు కూడా కీలకంగా మారాయి. ప్రధానంగా ఈడిగ - నీకరాలు - విశ్వకర్మ - గొల్ల - ఉప్పర - మాదివాలాలు - కుమబరాలు - తీగలాలు - సవితాలు - మరాఠాలు - కోలి - నంధారి రెడ్డిలు - కొదవాలల ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ అభ్యర్థుల గెలుపులో ఈ ఓట్లు కీలకం కానున్నాయి.
ప్రాంతాల వారీగా పలు సామాజికవర్గాల ఓట్లు కీలకం కానున్నాయి. దక్షిణ కన్నడ ప్రాంతం - శివమొగ్గ - కలబురగి నియోజకవర్గాల్లో ఈడిగ సామాజిక వర్గం వారి ఓట్లు గెలుపు - ఓటములను నిర్ణయించనున్నాయి. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో నికారాల సామాజిక వర్గం వారి ఓట్లు కీలకంగా మారాయి. బీసీ నాయకుడు శంకరన్న మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఓబీసీలోని చిన్న సామాజిక వర్గాల వాళ్లు రకరకాలుగా ఓట్లు వేస్తున్నారని చెప్పారు. వాళ్లు ఎప్పుడు ఎవరికి ఓటు వేస్తారో అర్థం కాదని - ఈ నేపథ్యంలో వారి ఆలోచనలను అంచనా వేయలేమని తెలిపారు. కానీ, కొన్ని ప్రాంతాల్లో గెలుపు - ఓటములను నిర్ణయించడంలో వీరి ఓట్లు కీలకం కానున్నాయని వివరించారు.
ఇదిలాఉండగా...కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. కర్ణాటకలో అధికార కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ రూపొందించిన మూడు వీడియో ప్రకటనలను మీడియా సర్టిఫికేషన్ - మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) నిషేధించింది. కర్ణాటక కాంగ్రెస్ కమిటీ ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాయని, ఈ నేపథ్యంలో వాటిని నిషేధిస్తున్నామని పేర్కొంటూ సమాచార - ప్రజా సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైన క్షేత్రస్థాయిలో ఈ ప్రకటనలను ప్రసారం చేసినా - పంపిణీ చేసినా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని హెచ్చరించింది.