సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం తమిళ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఆయన తన పార్టీగా అనుకుంటున్న పేరు ఇప్పుడు తమిళనాట సంచలనం రేపుతోంది, రజనీకాంత్ రాజకీయ పార్టీ పేరు ‘మక్కల్ సేవై కాతి’ అని, పార్టీ ఎన్నికల చిహ్నం ‘ఆటోరిక్షా’ అన్న వార్తలు సందడి చేస్తున్నాయి.
ఈ వేడిలోనే తాజాగా రైతుల కోసం పనిచేస్తున్న ‘మక్కల్ సేవై ఇయక్కం’ అనే పార్టీ సూపర్‌స్టార్ రజినీకాంత్ కు ఓ విజ్ఞప్తి చేసింది. రజినీకాంత్ రాజకీయ పార్టీ పేరు ఆమోదం గురించి భారత ఎన్నికల సంఘానికి ఒక లేఖ కూడా పంపింది. రైతుల తరఫున ‘మక్కల్ సేవై ఇయక్కం’ పనిచేస్తున్నందున, ఇలాంటి రాజకీయ పార్టీ పేరు వారి మరొకరికి ఇవ్వవద్దని ఎన్నికల సంఘాన్ని కోరింది.
తమ పార్టీని రజినీకాంత్ హైజాక్ చేస్తున్నారని.. సంవత్సరాల నుంచి తమ పార్టీ ఉనికిని గుర్తించాలని మక్కల్ సేవై ఇయక్కం సంస్థ కోరింది. తమ పార్టీని కప్పివేయకుండా రజినీకాంత్ పార్టీ పేరును మార్చాలని సూచించింది. సూపర్ స్టార్ రజినీ సైతం రాజకీయ పార్టీ పేరు పున:పరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారు.
అయితే రజినీకాంత్ పార్టీ పేరు ప్రస్తుతానికి ఒక సంచలనం మాత్రమే. అది ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. దాని విషయంలో సూపర్ స్టార్ స్పందన కోసం అందరూ వేచిచూస్తున్నారు.