కేజ్రీ అండ్ కో ఆపీసుకు ఎలా వెళుతున్నారు?

Update: 2016-01-01 07:42 GMT
కాలుష్యానికి చెక్ చెప్పేందుకు దేశంలో మరే రాష్ట్రం చేయనటువంటి సరికొత్త ప్రయోగాన్ని ఢిల్లీ రాష్ట్ర సర్కారు చేపడుతున్న సంగతి తెలిసిందే. తీవ్రస్థాయికి పెరిగిన ఢిల్లీ వాయుకాలుష్యాన్ని కంట్రోల్ చేసే పనిలో భాగంగా.. నిత్యం రోడ్ల మీదకు వచ్చే లక్షలాది వాహనాల్ని రాకుండా నియంత్రించేందుకు సరి.. బేసి విధానాన్ని అమలు చేయటం తెలిసింది. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ పథకానికి సంబంధించి విస్తృతమైన ప్రచారాన్ని చేపట్టారు. సుప్రీంకోర్టుతో పాటు పలువురు స్వాగతిస్తున్న నిర్ణయాన్ని కొత్త సంవత్సరం తొలి రోజు నుంచి అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ రోడ్ల మీద సగం వాహనాలు ఏకాఏకిన తగ్గిపోయే వీలుంది.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆయన మంత్రివర్గ సహచరులు ఎలా ప్రయాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అత్యంత ప్రముఖులు.. వికలాంగులు.. మహిళలకు సరి.. బేసి నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ.. తాను ఈ సౌకర్యాన్ని వినియోగించుకోనంటూ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీనికి తగ్గట్లే యన తన సొంత కారు (బేసి సంఖ్యలో ఉంటుంది)ను తానే నడుపుకుంటూ ఢిల్లీ సెక్రటేరియట్ కు వెళ్లనున్నారు. తనతో పాటుగా తన క్యాబినెట్ సహచరులైన.. మంత్రులు గోపాల్ రాయ్.. సత్యేందర్ జైన్ లను తనతో తీసుకెళ్లనున్నారు. ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేసిన సరి బేసి విధానం ఢిల్లీలో విజయవంతం కావాలని కోరుకుందాం.
Tags:    

Similar News