కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అనే తేడాలేకుండా.. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలకు కుటుంబాలే ఆప్తులను కోల్పోయారు. ఇక, కరోనా సోకిన వారికి ప్రాణం నిలబెట్టేందుకు అహరహం శ్రమించిన వైద్యులను , వైద్య సిబ్బందిని కూడా కరోనా వదిలి పెట్టలేదు. పీపీఈ కిట్లు ధరించి.. రోగులకు సేవలు అందించినా.. కరోనా .. వైద్యుల ప్రాణాలను తీసుకుంది.
కోవిడ్ సెకండ్ వేవ్‌లో భారత్‌లో 776 మంది డాక్టర్లు చనిపోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధికారికంగా తెలిపింది. వీరిలో ఎక్కువ మంది 45-60 ఏళ్ల మధ్య వారేనని వెల్లడించింది. అదేవిధంగా వేలాది మంది సిబ్బంది కూడా మరణించారని తెలిపింది. వీరిలో నర్సులు, వార్డు బోయ్‌లు, మార్చురీ సిబ్బంది ఉన్నారని వెల్లడించింది. అయితే.. కొన్ని రాష్ట్రాల నుంచి జాబితా రావాల్సి ఉందని తెలిపింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 776 మంది వైద్యులు మృతి చెందారని మెడికల్ అసోసియేషన్ చెప్పడం గమనార్హం.
దేశవ్యాప్తంగా మరణించిన వారిలో బీహార్‌లో 115 మంది, ఢిల్లీలో 109 మంది వైద్యులు కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లో 79 మంది, పశ్చిమబెంగాల్‌లో 62 మంది, తమిళనాడులో 50 మంది, రాజస్థాన్‌లో 44 మంది డాక్టర్లు చనిపోయారు. అదేవిధంగా నర్సుల సంఖ్య వీటిని మూడు రెట్లు ఉంటుందని.. పేర్కొంది. కాగా, కోవిడ్ మొదటి వేవ్‌లో గత ఏడాది దేశవ్యాప్తంగా 753 మంది డాక్టర్లు మృత్యువాతపడ్డారు. వీరికి అందాల్సిన పరిహారం ఇంకా అందలేదని.. ఇప్పటికీ .. ఆయా కుటుంబాల నుంచి తమకు ఫిర్యాదులు అందుతున్నాయని ఐఎంఏ పేర్కొనడం కేంద్ర ప్రభుత్వం సహా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును స్పష్టం చేస్తుండడం గమనార్హం.