టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బగా చెప్పాలి. తన పాలనలో తాను చేపట్టిన నిర్మాణాలపై ఇప్పటికే పలు విమర్శలు.. ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఆయన హయాంలో ఏరికోరి నిర్మించిన ప్రజావేదిక అక్రమ నిర్మాణమని.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిందన్న విషయం తెలిసిందే. దాన్ని కూల్చేయాలని జగన్ సర్కారు నిర్ణయించి.. కూల్చేశారు.
ప్రజావేదిక ఒక్కటే కాదు.. తాను నివాసం ఉండే అద్దె ఇల్లు సైతం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిందేనన్న విషయం ఇటీవల ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో ఉండటం ఎంతవరకు సబబు? అన్నది చర్చగా మారింది.
ఇదిలా ఉంటే.. తాజాగా బాబుగారి పార్టీ ఆఫీసు కూడా అక్రమ నిర్మాణంగా లెక్క తేలింది. ఆత్మకూరు గ్రామ జాతీయ రహదారి వెంట భారీ ఎత్తున టీడీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం కోసం నిబంధనల్ని బ్రేక్ చేసి నిర్మించినట్లుగా ప్రభుత్వ రికార్డు స్పష్టం చేస్తున్నాయి. బాబు అధికారంలో ఉన్నప్పుడు రూల్స్ ను పట్టించుకోకుండా వాగు పోరంబోకు స్థలాన్ని పార్టీ కార్యాలయ నిర్మాణానికి లీజుకు కేటాయించుకోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది.
3.65 ఎకరాలు ప్రభుత్వం కేటాయించగా.. నిర్మాణం చేపట్టిన నిర్మాణ సంస్థ ప్రభుత్వ వాగుకు చెందిన పోరంబోకుతో పాటు ప్రైవేటు రైతులకు సంబంధించిన భూముల్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్లుగా తేలింది. దీనిపై ఫిర్యాదులు రావటంతో ప్రభుత్వ రికార్డులతో క్రాస్ చెక్ చేసి చూడగా.. బాబుగారి పార్టీ కార్యాలయం అసలు భాగోతం బయటపడింది.
దీంతో.. నిర్మాణంలో ఉన్న టీడీపీ ఆఫీసుకు తాజాగా నోటీసులు జారీ చేశారు రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాల్ని తొలగించాలని పేర్కొన్నారు. ఏడు రోజుల్లో అక్రమ నిర్మాణాల్ని తొలగించని పక్షంలో ప్రభుత్వమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒకటి కాకుంటే ఒకటైనా.. నిబంధనలకు తగ్గట్లు నిర్మించేలా ప్లాన్ చేసుకోకపోవటం ఏమిటి చంద్రబాబు?