మంచి పని; హిందూ మతం డ్రైవర్ని ఇవ్వలేమన్న ఓలా

Update: 2015-04-08 13:30 GMT
రోజులు పెరిగే కొద్దీ ప్రాధామ్యాలు మారిపోతున్నాయి. సాంకేతికత పెరిగే కొద్దీ విశాలంగా వ్యవహరించాల్సిన మనిషి.. మతం.. కులం.. ప్రాంతం అంటూ మరింత సంకుచితంగా వ్యవహరిస్తున్నాడు. తాజా వ్యవహారం చూస్తే ఇదెంత తీవ్రస్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది.

హైదరాబాద్‌కుచెందిన వీరప్పనాయుడు తనకు క్యాబ్‌ కావాలని ఓలాను కోరాడు. అయితే.. ఇక్కడో ఫిట్టింగ్‌ పెట్టేశాడు. తనకు హిందూ క్యాబ్‌ డ్రైవర్‌ మాత్రమే కావాలని పోస్ట్‌ చేశాడు. అతని రిక్వెస్ట్‌ పంపిన ఆరు నిమిషాల తర్వాత ఓలా సమాధానం ఇస్తూ.. మతం ఆధారంగా మా డ్రైవర్లపై వివక్ష చూపలేం అంటూ ఒక సందేశాన్ని పంపింది.

తాజాగా ఆ మెసేజ్‌ ఇప్పుడు సోషల్‌ నెట్‌వర్క్సలో పెద్ద చర్చ రేపింది. విమానం.. బస్సు ఎక్కినప్పుడు కూడా ఇలాగే అడుగుతావా? అంటూ ఎటకారం.. ఎటకారం చేసుకున్నారు. మొత్తంగా వీరప్పనాయుడు రియాక్ట్‌ అయిన.. కస్టమర్‌ ప్రాధాన్యత చూడాలన్నది తన అభిమతమని.. ఎవరినీ బాధించాలని అనుకోలేదని కవర్‌ చేసుకునే ప్రయత్నం చేశాడు. కస్టమర్‌ ఛాయిస్‌ అంటే ప్రాణాపాయం వచ్చినప్పుడు డాక్టర్‌ దగ్గరకు వెళ్లినప్పుడు కూడా ఇలానే వ్యవహరిస్తాఆరా? కస్టమర్‌ ఛాయిస్‌ ఉండాలి కానీ.. అందుకు కొన్ని హద్దులు ఉంటేనే బాగుంటుంది మరి.

Tags:    

Similar News