ఓలా బోట్లు....సూప‌ర్ ప్లాన్ గురు..

Update: 2015-11-17 12:53 GMT
ఆన్‌ లైన్ క్యాబ్‌ ల ట్రెండ్ తెర‌మీద‌కు వ‌చ్చిన త‌ర్వాత ఈ మార్కెట్ లోకి అడుగుపెట్టిన‌ ఓలా క్యాబ్స్ త‌న‌దైన విభిన్న‌మైన ఎత్తుగ‌డ‌ల‌తో మార్కెట్లో ప్ర‌ముఖ స్థానాన్ని చేజిక్కున్న సంగ‌తి తెలిసిందే. ఇలా వినూత్న విధానాలు అవ‌లంభించి దేశంలో అతిపెద్ద ట్యాక్సీ సర్వీసులను అందిస్తున్న కంపెనీగా ఓలా గుర్తింపు పొందింది. ఇపుడు తాజాగా మ‌రో కొత్త రికార్డును ఓలా త‌న సొంతం చేసుకుంది.

క్యాబ్ స‌ర్వీసులో త‌న‌దైన ముద్ర‌వేసుకుక‌న్న ఓలా ఇపుడు బోటింగ్ సర్వీసులను కూడా ప్రారంభించింది. ఓలా బోట్ల వ‌ల్ల మ‌న‌కేంటి లాభం? అది కూడా ఎక్క‌డో విదేశాల్లో ప్రారంభించారేమో క‌దా అనుకుంటున్నారా.. కాదు మ‌న‌దేశంలోనే ప్రారంభించారు. స‌రిగ్గా చెప్పాలంటే పొరుగు రాష్ర్టం త‌మిళ‌నాడులో ఓలా బోట్ల సేవ‌లు ప్రారంభ‌మ‌య్యాయి.

ఎడతెరిపిలేకుండా భారీ వర్షాల పడటం మూలంగా చెన్నై నగర వీధులన్నీ జలమయం అయి అడుగు తీసి అడుగు వేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌జా ర‌వాణాకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో ఓలా సంస్థ ప్రత్యేకంగా బోటింగ్ సర్వీసులకు శ్రీ‌కారం చుట్టి నీటిలో చిక్కుకున్నవారిని రక్షించే పనులు ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణపొందిన బోటింగ్ సిబ్బందిని రంగంలోకి దించింది. వీధుల్లో నీటి నిల్వ ఉన్నన్ని రోజులు ఈ బోటింగ్ సర్వీసులు అందించేందుకు ఓలా సిద్ధ‌మైంది. రాష్ట్ర విపత్తు నిర్వహణా విభాగం ఆదేశాల మేరకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ ఆప‌ద‌లో ఉన్న ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు అత్యంత ఉప‌యుక్త‌మైన స‌ర్వీసు అని త‌మిళ‌తంబీలు భావిస్తున్నారు.
Tags:    

Similar News