``మా పాలనలో మహిళలకు సమున్నత గౌరవం కల్పిస్తాం. రాష్ట్రంలోని ఏ మహిళా కన్నీరు పెట్టకుండా కాచుకుంటాం`` అని మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సాక్షాత్తూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన అభాసుపాలవుతోంది! బాబు పాలనలో మహిళలు సిగ్గుతో కుమిలిపోతున్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నామని, ప్రతి నెలా 1నే ఠంచనుగా పింఛన్ ఇస్తున్నామని పదే పదే చెప్పుకొనే బాబు పాలనలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మాకు పింఛన్ మంజూరు చేయడంలేదని మొర పెట్టుకుంటున్న మహిళలు లక్షల్లో ఉన్నారు. తాజాగా వెలుగు చూసిన ఘటనలో పింఛను మంజూరు చేయమని కోరిన మహిళను ఆమె కుటుంబాన్నీ టీడీపీ నేతలు ఘోరంగా అవమానించారు. వివరాల్లోకి వెళ్తే..
నెల్లూరు జిల్లా వెంటగిరి మండలంలోని కలపాడు గ్రామానికి చెందిన వృద్ధురాలు గిన్నేరి నరసమ్మకు కొన్నాళ్ల కిందట భర్త చనిపోయాడు. ఆయన బతికి ఉన్నంత వరకు కూలి నాలి చేసుకుని జీవనం సాగించిన ఈ కుటుంబం.. ఇప్పుడు జీవనాధారం కోల్పోయింది. ఈ క్రమంలో తనకు వితంతు పింఛన్ మంజూరు చేయించాలని స్థానిక టీడీపీ కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేసింది. అయితే, గతంలో ఈమె భర్త వైసీపీలో చురుగ్గా పనిచేయడంతో టీడీపీ నేతలు దీనిని సాకుగా చూపి.. నరసమ్మకు పింఛన్ మంజూరు చేసేందుకు ఒప్పుకోలేదు. అయినా కానీ నరసమ్మ పదేపదే వారికి తన బాధ వినిపించడంతో ఆఖరుకు ఘోరంగా అవమానించారు. ఈ విషయాన్ని ఆమె జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో చెప్పుకొని వాపోయింది.
`‘నా భర్త మృతి చెంది ఏడు నెలలు అయింది. కూలి చేసుకుంటేగానీ జీవనం సాగదు.. ప్రభుత్వం నుంచి వచ్చే వితంతవు పింఛన్ ను మంజూరు చేయించమని టీడీపీ కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేసుకున్నా.. అయితే మీరు వేరే పార్టీకి చెందిన వాళ్లు కాబట్టి కుటుంబ సభ్యులంతా వచ్చి మా కాళ్లు పట్టుకుంటే పింఛన్ మంజూరు చేయిస్తాం’ అని అధికారపార్టీ నాయకులు ఘోరంగా అవమానించినట్టు నరసమ్మ లబోదిబోమని కన్నీటి పర్యంతమైంది. మండలంలోని కలపాడు గ్రామంలో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభానికి విచ్చేసిన జెడ్పీ చైర్మన్ కు కలపాడు దళితవాడ వాసులు పలు సమస్యలను చెప్పుకొచ్చారు.
తమ గ్రామానికి సీసీరోడ్లు లేవని, దీంతో వర్షాకాలంలో రోడ్లపై నడవాలంటే తీవ్ర ఇబ్బందికరంగా ఉందని వాపోయారు. అంతేగాక తమ గ్రామంలో పింఛన్ అర్హత కలిగిన 15 మంది ఉన్నామని ఒక్కరికి కూడా టీడీపీ నాయకులు పింఛన్ మంజూరు చేయడం లేదని వాపోయారు. రేషన్ కార్డు లేనివారు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోతోందని వాపోయారు. వీరి ఆవేదనను చూసి చలించిన బొమ్మిరెడ్డి త్వరలోనే కష్టాలు తీరతాయని భరోసా ఇచ్చారు.