చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి.. ప్రపంచాన్ని ఎంతలా ప్రభావితం చేసిందో.. ఎన్ని లక్షల ప్రాణాల్ని తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెక్నాలజీతో అద్భుతాల్ని క్రియేట్ చేస్తున్న సమయంలో విరుచుకుపడిన కరోనా.. ప్రపంచ మానవాళికి నేర్పిన పాఠం ఏమైనా ఉందంటే.. మీరేం తోపులు కాదు.. చాలా చాలా నార్మల్ మనుషులు అని చెప్పేసింది. కంటికి కనిపించని వైరస్ తోనే మానవాళికి ముచ్చమటలు పోయించిన మహ్మామారి డేంజర్ ఇంకా పోలేదనే చెప్పాలి. ఏదో రూపంలో వెంటాడుతున్న ఈ వైరస్.. తాజాగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ చెలరేగిపోతూ ఇబ్బంది పెడుతుందని చెప్పాలి.
తాజాగా పలు దేశాల్లో నమోదవుతున్న కేసుల్లో ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ (బీఏ 4.. బీఏ 5) తెగ ఇబ్బంది పెట్టేస్తున్న వైనాన్ని గుర్తించారు. దీనికి సంబంధించి పలు షాకింగ్ అంశాలు తాజాగా బయటకు వచ్చాయి. ఇటీవల కాలంలో మన దేశంతో పాటు అమెరికా.. యూకే.. ఇటలీ.. చైనాల్లో కొత్త కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో ఎక్కువ భాగం బీఏ4.. బీఏ5 వేరియంట్లేనని గుర్తించారు. ఈ వేరియంట్లు వ్యాక్సిన్ కు సైతం కొరుకుడుపడలేదన్న విషయాన్ని గుర్తించారు.
కొవిడ్ వ్యాక్సిన్ తో వచ్చే రోగ నిరోధక శక్తిని సైతం ఈ కొత్త ఉప వేరియంట్లు హరిస్తాయన్న కొత్త విషయాన్ని గుర్తించారు. దీని కారణంతో.. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వారాల వ్యవధిలోనే కరోనా సోకే ప్రమాదం ఉందన్నది తాజాగా తేలింది.
సాధారణంగా వ్యాక్సిన్ తీసుకున్న వారికి రోగనిరోధక శక్తి వస్తుందన్న విషయాన్ని ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించటం తెలిసిందే. దాని రక్షణతో వైరస్ రాకుండా చేస్తుందన్న వాదనను తోసి పుచ్చేలా బీఏ5 ఉప వేరియంట్ తీరు ఉందని చెబుతున్నారు.
రోగ నిరోధక శక్తిని హరించటంతో పాటు వైరస్ ను ఒకరి నుంచి మరొకరికి వెంటనే సోకేలా చేసే సత్తా దీని సొంతం. గతంలో వచ్చిన ఇమ్యూనిటీని ఎదుర్కొని సులువుగా శరీరంలోకి ప్రవేశించటమే దీని లక్షణంగా చెబుతున్నారు.
ఈ ఉప వేరియంట్ కు ఉన్న మరో దరిద్రపుగొట్టు లక్షణం ఏమంటే.. డెల్టా.. ఒమిక్రాన్.. బీఏ 1 వేరియంట్ బారిన పడి కోలుకున్నంతనే వచ్చే రోగనిరోధక శక్తి సైతం బీఏ5 ఉప వేరియంట్ తో ఎలాంటి రక్షణ ఉండదన్న విషయాన్ని గుర్తించారు. మూడు డోసులు తీసుకున్న వారిలోనూ ఈ వేరియంట్ మళ్లీ సోకుతుందన్న విషయాన్ని పసిగట్టారు. ఇదంతా చూసినప్పుడు గతంలో వచ్చిన వేరియంట్ల కంటే బీఏ5 ఉప వేరియంట్ మరింత డేంజర్ అన్న మాట ఇటీవల ప్రచురితమైన సైన్స్ జర్నల్ నివేదికలోనూ పేర్కొనటం గమనార్హం.