కొత్త వైరస్ కల్లోలం : అమెరికా అధ్యక్షుడి వరకూ ‘ఒమిక్రాన్’..

Update: 2021-12-21 15:30 GMT
క్రిస్మస్ సంబరాలను సంతోషంగా జరుపుకోవడానికి రెడీ అవుతున్న అమెరికన్లను కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ భయపెడుతోంది. ఎక్కువ మంది ప్రజలు ప్రయాణాలు చేయడం.. సెలవుల కోసం గుమిగూడడం వల్ల అమెరికాలో కోవిడ్-19 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ తీవ్రంగా ప్రబలుతోంది.   అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తాజా మోడల్ అంచనాల ప్రకారం.. డిసెంబర్ 11తో ముగిసిన వారంలో మొత్తం ఇన్ఫెక్షన్ కేసులు 12.6 శాతం నుంచి డిసెంబర్ 18తో ముగిసిన వారంతో ఒమిక్రాన్ వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్ కేసులు 73.2 శాతానికి చేరుకున్నాయి.

ఈ నెల ప్రారంభంలో, ఓమిక్రాన్ మొత్తం ఇన్ఫెక్షన్ కేసులలో 0.7 శాతం మాత్రమే.  ఒమిక్రాన్ అమెరికా దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. డిసెంబర్ 1న కాలిఫోర్నియాలో దేశంలో మొదటి కేసు కనుగొనబడినప్పటి నుంచి సోమవారం నాటికి కనీసం 48 అమెరికా రాష్ట్రాల్లో కనుగొనబడింది. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రంగా ప్రబలుతున్న అంటువ్యాధి. రోగనిరోధక వ్యవస్థ నుండి తప్పించుకునే దాని సామర్థ్యం దేశవ్యాప్తంగా ఆందోళనలను రేకెత్తించాయి. అయితే కొత్త వేరియంట్  తీవ్రమైన లక్షణాలు కలిగి ఉందని.. ఆసుపత్రిలో చేరడానికి కారణమవుతుందని ప్రాథమిక డేటా సూచించినట్లు నిపుణులు తెలిపారు.

యునైటెడ్ స్టేట్స్‌లో కోవిడ్-19 కేసులు, మరణాలు, ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది స్పోర్ట్స్ గేమ్‌లు, లైవ్ కచేరీలతో సహా పెద్ద ఈవెంట్‌లను రద్దు చేయడానికి దారితీసింది. విద్యార్థులను ముందుగానే ఇంటికి తిరిగి వెళ్లేలా చేయడానికి కొన్ని కళాశాలలు ఆన్‌లైన్ తరగతులు.. మిగిలిన సెమిస్టర్‌ల పరీక్షలను ఆన్ లైన్ లోకి మార్చేశాయి.  

అమెరికా దేశంలో ప్రతిరోజూ సగటున 130,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత వారంతో పోలిస్తే ఇది 10 శాతం పెరిగింది. తాజా  సీడీసీ డేటా ప్రకారం.. ఏడు రోజుల రోజువారీ మరణాల సగటు 1,180, మునుపటి వారం కంటే 8.2 శాతం పెరిగింది.

ప్రస్తుతం అమెరికాలో ప్రతిరోజూ దాదాపు 7,800  ఆసుపత్రుల్లో కొత్త  అడ్మిషన్లు జరుగుతున్నాయి. గత వారంతో పోలిస్తే ఇది 4.4 శాతం పెరిగింది. డేటా చూపించింది. న్యూయార్క్ రాష్ట్రం 22,000 కంటే ఎక్కువ పాజిటివ్ కేసులతో ఆదివారం వరుసగా మూడో రోజు కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ రికార్డును నెలకొల్పింది. పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు.

ఏదేమైనా.. కొత్త ఇన్ఫెక్షన్ కేసుల పెరుగుదల ప్రజలను సెలవులకు వెళ్లకుండా నిరోధించడం లేదు. ఎన్ని కేసులు పెరుగుతున్నా ప్రజలు తమ ప్రయాణాలు ఆపడం లేదు. అమెరికా ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ) వరుసగా నాలుగో రోజు రెండు మిలియన్ల మంది ప్రయాణించారు.. డిసెంబర్ 23, జనవరి 3 మధ్య 21 మిలియన్ల మంది అమెరికన్లు ప్రయాణించవచ్చని టీఎస్ఏ అంచనా వేసింది.  అమెరికా క్రిస్మస్ పండుగ మూడ్ లో ఉందని.. ఈ క్రమంలోనే ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు.

జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం డేటా  ప్రకారం.. ఒక నెల క్రితం కేసుల సంఖ్య సగటున రోజుకు 90,000కి పెరిగింది. డిసెంబరులో చాలావరకు 120,000 కేసులు నమోదయ్యాయి. కానీ ఇటీవల రోజుకు 130,000 కంటే ఎక్కువ పెరిగాయి.  

ప్రయాణాలు.. పెద్ద సమావేశాలకు వెళ్లే ముందు, టీకాలు వేసుకోవడం మరవద్దని.. పబ్లిక్ ఇండోర్ సెట్టింగ్‌లలో మాస్క్ ధరించాలని..  భౌతిక దూరం పాటించడం వంటి వాటికి ముందు పరీక్షించాలని ఆరోగ్య నిపుణులు ప్రజలను కోరారు.

-అమెరికా అధ్యక్షుడిని కలిసిన ఉద్యోగికి పాజిటివ్..
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. అధ్యక్ష భవనంలోని ఓ ఉద్యోగికి సోమవారం కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ వ్యక్తి మూడు రోజుల క్రితం అధ్యక్షుడితో కలిసి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించినట్లు వైట్ హౌస్ అధికార ప్రతినిధి జెన్ సాకీ తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధ్యక్ష భవనంలోని వైద్యులు జోబైడెన్ కు కోవిడ్ టెస్టులుచేశారు. ఈ పరీక్షల్లో జోబైడెన్ కు నెగెటివ్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు.  అధ్యక్షుడికి బుధవారం మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
Tags:    

Similar News