కరోనా మొదటి వేవ్ ను నియంత్రించి.. రెండో వేవ్ కు బలైన భారతదేశం.. ఇప్పుడు మూడో ముప్పు ముగింట పొంచి ఉంది. మళ్లీ లాక్ డౌన్ నాటి పరిస్థితులు భయపెడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో కేసులు తగ్గడంతో అంతా సాధారణ జీవితంలోకి వచ్చేశారు. కానీ ఇప్పుడు అందరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఒమిక్రాన్ వేరియంట్. దీంతో మళ్లీ ఆంక్షల వలయం ప్రారంభమైంది. తాజాగా వివాహాలు, శుభకార్యాలు, సినిమా హాళ్లు అన్నింటికి ఆంక్షలు పెడుతున్నారు.
ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ముప్పు మళ్లీ భయపెడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాలను కూడా ఈ మహమ్మారి భయపెడుతోంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో తక్కువ కేసులే ఉన్నా.. చాలా మంది శాంపిల్స్ నిర్ధారణ కావాల్సి ఉంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నిత్యం డబుల్ డిజిట్ కేసులు నమోదవుతుండడం ఆందోళన పెంచుతోంది.
ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అందరిలోనూ మళ్లీ ఆందోళన మొదలైంది.
ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ ను మహారాష్ట్ర ప్రభుత్వం విధించింది. ఆంక్షల విషయంలో చాలా కండీషన్ పెట్టింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కంటే ఎక్కువమంది గుమిగూడకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెళ్లిళ్లకు హాజరయ్యే బంధువులు, సన్నిహితులపైనా ఆంక్షలు పెట్టింది.
క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండడంతో కట్టడి చేసేందుకు ఆయా దేశాలు సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి.దాదాపు 100 దేశాల్లో ఇప్పటికే ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.
అటు డెల్టా, ఇటు ఒమిక్రాన్ రెండూ పొంచి ఉండడంతో ఈ వైరస్ ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. దేశంలో థర్డ్ వేవ్ రాకుండా నిలువరించే దిశగా మోడీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. ఇప్పటికే యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించింది.