దాయాదికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన భారత్

Update: 2017-03-23 17:25 GMT
భారత్ ను కెలకటమే ధ్యేయంగా పెట్టుకున్నదాయాది పాకిస్థాన్.. ఏదో విధంగా కశ్మీర్ ఇష్యూను తెర మీదకు తీసుకురావటం.. పెడసరపు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. గత ప్రభుత్వాల చేతకానితనం..జమ్మూ కశ్మీర్ అంశంపై అనుసరించిన రెండు నాల్కల ధోరణితో సమస్యను మురగబెట్టి.. పాక్ నోరు పెట్రేగేలా అవకాశం ఇచ్చిన వైనాన్ని మర్చిపోకూడదు. మోడీ ప్రదానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత..భారత్ ప్రయోజనాల్ని బలంగా వినిపించటమే కాదు.. కశ్మీర్ విషయంలో తన వైఖరి ఏమిటన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

యుద్ధంలో ఓటమి చెంది కూడా.. భారత్ భూభాగాన్ని ఆక్రమించుకొని.. దాన్ని వదిలిపెట్టని పాక్ తీరును చూసీచూడనట్లుగా పెంచిపోషించింది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని నాటి ప్రభుత్వాలు.నాడు చేసిన తప్పులకు నేటికీ మూల్యం చెల్లిస్తున్న వైనాన్ని మర్చిపోకూడదు. కశ్మీర్ ప్రజల్ని రెచ్చగొట్టేలా.. వారిని ఏదోలా ప్రభావితం చేసేలా పాక్ తరచూ వ్యాఖ్యలు చేయటం మామూలు. తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేశారు పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్. కశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నట్లుగా సమస్య పరిష్కారం చూపే తీర్మానానికి తాను అనుకూలమన్నారు.

దీనికి ఘాటైన బదులిచ్చారుకేంద్రమంత్రి జితేంద్ర సింగ్. జమ్మూ కశ్మీ విషయంలో భారత్..పాక్ ల మధ్య ఏదైనా సమస్య ఉందంటే.. అది పాక్ ఆక్రమించుకున్న కశ్మీర్ ప్రాంతమేనని.. అక్రమంగా ఆక్రమించుకున్న పాక్ అక్రమిత భూభాగాన్ని వెనువెంటనే వదిలిపెట్టి వెళ్లాలన్నారు. పాకిస్థాన్ ఏయే ప్రాంతాల్ని అక్రమంగా ఆక్రమించిందో వాటన్నింటిని వదిలేసి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేసిన ఆయన.. మరో కీలకమైన వ్యాఖ్య చేయటం గమనార్హం.

‘‘గిల్గిత్..బలూచిస్థాన్.. పాక్ అక్రమించిన భూభాగాన్ని తిరిగి ఎలా స్వాతంత్ర్యం  తీసుకురావాలన్నదే ఇప్పుడు ప్రధాన అంశం. పాక్ ఆక్రమించిన కశ్మీర్ భూభాగానికి స్వాతంత్ర్యం ఇప్పించి.. తిరిగి భారత భూభాగంలో ఎలా కలపాలన్నదే ఇప్పుడు ముఖ్యమైన అంశం’’ అంటూ జితేంద్రసింగ్ వ్యాఖ్యానించారు. ఇంత సూటిగా..కుండబద్ధలు కొట్టినట్లుగా పాక్ అక్రమిత కశ్మీర్ ఇష్యూ మీద ఎవరూమాట్లాడింది లేదని చెప్పక తప్పదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News