తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎక్కువ అన్న విషయం అందరికీ తెలిసిందే. అత్యధిక కాంగ్రెస్ నాయకులు నేనే సీఎం అభ్యర్థి అని ఫీలవుతుంటారు. అందులో తెలుగుదేశంలో నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి వారికి తోడయ్యారు. ఈరోజు రేవంత్ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో జర్నలిస్టులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ పై విమర్శలు చేస్తూనే తాను ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలనుకుంటున్నారో చెప్పడానికి ట్రై చేశారు.
అంటే మిగతా వాళ్లు ముఖ్యమంత్రి అవడానికి ఏం చేయాలో వ్యూహాలు రచిస్తుంటే.. రేవంత్ మాత్రం ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఆయన మాటల్లో అది స్పష్టంగా కమ్యూనికేట్ అయ్యింది.
ఎవరైనా నీకు అనుభవం లేదు కదా అంటారేమో అంటారని ముందే సిద్ధమైన రేవంత్ రెడ్డి... ఇద్దరు ఉద్దండులతో తనను పోల్చుకున్నారు. పరిపాలన అనుభవం అవసరం లేదని ఇప్పటికే ఎన్టీఆర్ - రాజీవ్ గాంధీ నిరూపించినట్టు చెప్పారు. అయితే, తెలుగుదేశం నుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెండు పార్టీల నుంచి ఒక్కో రోల్ మోడల్ ను తీసుకుని పొత్తు ధర్మాన్ని ప్రెస్ మీట్లో పాటించడానికి ప్రయత్నించారు. అనుభవం లేకుండానే ఎన్టీఆర్ జనరంజక పాలన అందించారని - అలాగే రాజీవ్ గాంధీ అనుభవం లేకనే దేశానికే తలమానికమైన నిర్ణయాలతో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని... తాను కూడా అలా చేయగలనని చెప్పుకువచ్చారు.
తాను ముఖ్యమంత్రి అయితే జర్నలిస్టులు - పోలీసులు - ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక సేవలు అందిస్తానని అంటూ వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు రేవంత్. ఎన్నికల సమయంలో జర్నలిస్టులు - పోలీసుల పాత్ర కీలకమని రేవంత్ కు బాగా తెలుసు కదా. అందుకే వారిపై దృష్టి పెట్టారు. రైతుల విషయంలోనూ తనకు మంచి ఆచరణీయమైన ఐడియాలున్నట్లు రేవంత్ వివరించారు.