ఒకవైపు తనది పాతికేళ్ల రాజకీయం అంటూ పవన్ కల్యాణ్ చెబుతున్నా జనసేనలోని నేతలకు మాత్రం అది అంత ఎక్కుతున్నట్టుగా లేదు. ఆ పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లడం కొనసాగుతూ ఉంది. ఈ జాబితాలో తాజా పేరు తెర మీదకు వచ్చింది. జనసేన పార్టీ తరఫున ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన ఆకుల సత్యనారాయణ తను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.
జనసేనకు రాజీనామా చేసి ఈయన తిరిగి భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. గత ఐదేళ్లూ ఈయన బీజేపీలోనే ఉండేవారని వేరే చెప్పనక్కర్లేదు. ఈయన బీజేపీ ఎమ్మెల్యేగా ఉండగానే ఈయన భార్య జనసేనలోకి చేరారు. అలా తను కూడా పవన్ కల్యాణ్ పార్టీలోకి చేరబోతున్న సంకేతాలను ఇచ్చారీయన.
అనుకున్నట్టుగానే ఈయన ఎన్నికల సమయానికి జనసేనలోకి చేరారు. బీజేపీ మోసం చేసిందని అన్నారు. ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈయన గెలిచేస్తారని జనసేన అనుకున్నా అదేం జరగలేదు. దీంతో ఎన్నికలు అయ్యాకా పెద్దగా యాక్టివ్ గా లేని ఆకుల ఇప్పుడు తిరిగి భారతీయ జనతా పార్టీలోకి చేరిపోతున్నారట.
ఎన్నికల ఫలితాలు వచ్చాకా చాలా మంది జనసేనను వీడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఆకుల సత్యనారాయణ కూడా ఆ జాబితాలోకే చేరిపోయారు.