ఆపరేషన్ ఫాం హౌస్ : కమలంతో కనెక్షన్ సెట్ అయ్యేదెట్టా...?

Update: 2022-10-28 16:30 GMT
తెలంగాణాలో ఇపుడు టీయారెస్ ఆపరేషన్ ఫాం హౌస్ ఇష్యూ హాట్ హాట్ గా చర్చకు వస్తోంది. ఒక నలుగురు టీయారెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి చూసింది అన్నది టీయారెస్ నాయకులు టాప్ టూ బాటం దాకా ఆరోపిస్తున్నారు. అయితే ఫాం హౌస్ లో నలుగురు టీయారెస్ ఎమ్మెల్యేలతో ఎదురుగా కూర్చున్న వారికి కమలంతో కనెక్షన్లు ఎలా చూపించాలి అన్నదే ఇపుడు అతి పెద్ద పాయింట్ గా ఉంది అంటున్నారు. నిజానికి ఈ ఫాం హౌస్ ఆపరేషన్ లో సీన్ లోకి వచ్చిన సింహ యాజీ అన్న ఆయన ఎవరు అన్నది కనుక ఆరా తీస్తే ఆయన టీయారెస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఆస్థాన జ్యోతిష్య సలహాదారుడు అని తేలుతోందిట.

ఈ కేసులో అరెస్ట్ అయిన ఈ సింహ యాజీ ద్వారా బీజేపీని  ఇరికించాలని చూస్తున్నా కనెక్షన్లు ఎక్కడా లింక్ అవడం లేదా అన్నదే చర్చగా ఉంది మరి. బీజేపీ సింహ యాజీ వంటి వారిని పెట్టుకుని తమ ఎమ్మెల్యేలను ఆకర్షించాలని చూసింది అన్నదే టీయారెస్ ఆరోపణ.  అలా ఈ మొత్తం ఎపిసోడ్ కి సింహ యాజీని  కీ పాయింట్ గా చేయాలనుకున్నా కనెక్షన్లు మాత్రం ఎక్కడా సెట్ అవడంలేదు అని అంటున్నారు.

నిజానిక్ ఈ సింహ యాజీ గురించి పోలీసులకు కూడా  పెద్దగా తెలియదు అని అంటున్నారు. ఆయన గురించి పోలీసులు  తిరుపతిలోని అన్ని మఠాలు  దాని పరిసర ప్రాంతాలలో వెతికి చూస్తే ఈ సింహ యాజీ అన్న ఆయన  తిరుచానూరు నివాసి అని తేలింది. చిత్రమేంటి అంటే ఆయన గురించి ఆయన ఉన్న చోటనే ఎవరికీ అసలు తెలియదు అని అంటున్నారు. ఇక మరో వైపు చూస్తే టీయారెస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి జ్యోతిష్య సలహాదారు అని తేలింది.

ఈ సింహ యాజీ అన్నాయన  తాండూరు, హైదరాబాద్‌లలోని ఎమ్మెల్యే రో హిత్ రెడ్డి నివాసానికి ప్రతీ రోజూ   వెళ్లి అక్కడ  ప్రత్యేక పూజలు నిర్వహించేవారని కూడా పోలీసుల దర్యాప్తులో  తేలింది. మరో వైపు చూస్తే సింహ  యాజీ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ఇంటెలిజెన్స్ వర్గాకు ఆయనకు బీజేపీతో ఎలాంటి కనెక్షన్లు లేవని వెల్లడించాయి. దీంతోనే ఆపరేషన్ టీయారెస్ ఫాం హౌస్ మీద ఆరోపణలు అన్నీ ఒక్కసారిగా గాలికి ఎగిరిపోతున్నాయి అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఈ సింహా యాజీకి బీజేపీతో ఏ స్థాయిలోనూ సంబంధాలు లేవని విచారణలో తేలింది. దాంతో ఇప్పుడు ఈ కేసులో స్వామీజీ రామచంద్ర భారతితో బీజేపీకి ఉన్న బంధాలను కలిపి ఆయన్ని ఫిక్స్ చేయడానికి చూస్తున్నారా అన్న చర్చ కూడా మొదలైంది. అయితే ఇలాంటివి ఎన్ని చేసినా  కూడా ముఖ్యంగా ఈ విషయాలు  తేలాల్సింది న్యాయ పరీక్షకు.

మరి న్యాయస్థానాల్లో న్యాయపరీక్షకు నిలబడగలిగే విధంగా బీజేపీతో బలమైన సంబంధాలు కలిగి ఉన్నారన్న వ్యక్తులు ఫాం హౌస్ లో టీయారెస్ ఎమ్మెల్యేలతో ఉన్నారా అన్నదే ఇపుడు కీలకమైన విషయం.  ఆ విషయంలో కనుక ఇంటలిజెన్స్ తమ నైపుణ్యాన్ని చూపించి ఆధారాలు చూపిస్తే అపుడు ఈ కేసు కీలకమైన మలుపు తిరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా   ఈ అరెస్ట్ అయిన వారికి బీజేపీతో  ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయాన్ని ఇంటలిజెన్స్ వర్గాలు ప్రస్తుతం నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News