దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ లో అందరూ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఆక్సిజన్. కరోనా మహమ్మారి వ్యాధి తో కంటే , సరైన సమయానికి ఆక్సిజన్ అందక చనిపోయే వారే ఎక్కువగా ఉన్నారు. టెంపుల్ టౌన్ తిరుపతిలోని ప్రఖ్యాత రామ్ నారాయణ్ రూయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఒకేరోజు 11 మంది మరణించారు. ఈ పెను విషాదకర ఘటన అనంతరం సీఎం యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. బాధాకరమైన ఘటనలు కూడా జరుగుతున్నాయని.. నిన్న రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన తీవ్రంగా కలచి వేసిందన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం ప్రకటించారు. మనం ఎంత కష్టపడుతున్నా, ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాలకు కూడా మనం బాధ్యత వహించాల్సి వస్తోందన్నారు. ఈ ఘటనపై వెంటనే పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కలెక్టర్ హరినారాయణన్ విచారణ చేపట్టారు. చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంతో ఇబ్బంది తలెత్తిందని కలెక్టర్ వెల్లడించారు. వెంటనే ఆక్సిజన్ పునరుద్ధరించడం వల్ల చాలా మందిని రక్షించామని తెలిపారు.
రూయా ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘటనపై సీఎం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో ఉండే ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను తూర్పు నౌకాదళం అధికారుల చేతికి అప్పగించారు. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఈస్టర్న్ నావల్ కమాండ్ అధికారులు ఇక మీదట ఆసుపత్రుల్లో ఉండే ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణను చూసుకుంటారు. సీఎం జగన్ ఈ మేరకు వైజాగ్ ఈస్టర్న్ నావల్ కమాండ్ అధికారులకు విజ్ఞప్తి చేసిన కొద్దిసేపటికే ,అక్కడి నుంచి ప్రత్యేక అధికారుల బృందం తిరుపతికి బయలుదేరింది. రూయా ఆసుపత్రిని సందర్శించింది. ఈ బృందంలో ఆరుమంది అధికారులు ఉన్నారు. రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్, రెసిడెంట్ డాక్టర్ ను కలిశారు. సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
దీనితోపాటు- రూయా ఆసుపత్రిలో ప్రాంగణంలోనే మరో ఆక్సిజన్ ప్లాంట్‌ను నిర్మించబోతున్నట్లు తెలిపారు. అనంతరం వారు ఆక్సిజన్ ప్లాంట్ లో కాసేపు తిరిగి మొత్తం పరీక్షించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఒత్తిడి ఆసుపత్రులపై తీవ్రమైందని, అందుకే, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై ఉద్యోగులు, సిబ్బంది దృష్టి సారించట్లేదనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. దీనితోనే వాటి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను నౌకాదళాధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది.