డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేయడానికి పోలీసులు , సంబంధిత అధికారులు ఎంతగా అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారో , అంతకంటే ఎక్కువగా డ్రగ్ ముఠా వారు కూడా వారి తెలివి తేటలకి పదునుపెట్టి పోలీసులకే షాకులు ఇస్తున్నారు. సాధారణ పంటల మధ్య డ్రగ్స్ కు అవసరమైన రా మెటీరియల్ సాగు చేస్తూ భారీగా లాభం ఆర్జించుకుంటున్నారు. ఇలాంటి భారీ మాఫియా గుట్టును మదనపల్లె పోలీసులు రట్టు చేశారు. ఈజీ మనీకి అలవాటు పడ్డ వ్యక్తులు అక్రమ మార్గాలు పడుతున్నారు. చివరకు కొందరు రైతులను ఈ రొంపిలోకి దింపుతూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు.
ఈ తరహా కేసు చిత్తూరు జిల్లా మదనపల్లెలో వెలుగు చూసింది. మదనపల్లెలో కూలీలతో డ్రగ్స్ కు అవసరమైన పంట పండిస్తున్న తీరు అందరికి షాక్ కి గురిచేస్తుంది. ఓ భారీ డ్రగ్ మాఫియాను పోలీసులు ఛేదించి ఇద్దర్ని అరెస్టు చేశారు. కీలక వ్యక్తుల కోసం వేట సాగిస్తున్నారు. మదనల్లెలో టమాటో పంట సాగు పేరుతో కొందరు వ్యక్తులు ఓపీఎంను పండిస్తున్నారు. దీన్ని మార్ఫిన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ కోసం ఉపయోగిస్తారు. ఈ పరిసరాలు చూస్తే టమాటో పంట సాగు కనిపిస్తుంది కానీ, లోపలికి వెళ్లి చూస్తే మత్తు పదార్థాలకు అవసరమైన రా మెటీరియల్ పండిస్తున్న తెలుస్తుంది. ఎన్నో రోజులుగా ఈ దందా సాగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఎస్ ఈబీ అధికారులు మెరుపుదాడి చేశారు. ఓపీఎం కాయాలు ధ్వంసం చేశారు. అధికారులు వెళ్లే సరికి ఇద్దరు కూలీలు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇంకా ఎవరూ కనిపించలేదు. వాళ్లను అరెస్టు చేసిన ఆఫీసర్స్ పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఉన్న అసలు నిందితుల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. కూలీలతో ఈ తప్పుడు పనులు చేయించి, వేరే వ్యక్యులు లాభపడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా ఏఏ ప్రాంతాల్లో ఇలాంటి పనులు చేస్తున్నారనే కోణంలోనూ అధికారులు కూపీ లాగుతున్నారు. డబ్బులకు ఆశపడి రైతులు ఇలాంటి తప్పుడు దారిలో వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్ లో అంధకారం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి ఇంకా ఎక్కడైనా చూస్తే తమకు సమాచారం అందివ్వాలని కోరుతున్నారు. అనుమానితులు కనిపిస్తే తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు.