ఆస్ట్రేలియా లో అంటుకున్న కార్చిచ్చు కారణంగా ఇప్పటికే అడవులు దహించిపోయాయి. లక్షలాది జంతువులు కాలిపోయి అపార నష్టం వాటిల్లింది. 20 మంది వరకూ మానవులు చనిపోయారు. మంటల్లో చిక్కుకొని చనిపోయిన జంతువుల ఫొటోలు చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. 480మిలియన్ల జంతువులు చనిపోయాయని అంచనా.. ఆస్ట్రేలియాలో వేసవి కావడంతో నీటి కొరత కూడా వెంటాడుతోంది. దీంతో ఈ ఎండలకు తాళలేక ఒంటెలు కూడా ఊళ్లపై పడి నీటిని బాగా తాగేస్తున్నాయట..
నీటి కొరత , ఒంటెలు ఊళ్లపై పడి నీటిని తాగుతుండడం తో ఆస్ట్రేలియా ప్రజలు నీటికొరతతో అల్లాడుతున్నారట.. అందుకే దాదాపు 10వేల ఒంటెలను చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించిందని అక్కడి పత్రికలు తెలిపాయి. దీంతో దుమారం రేపింది. 5రోజుల్లో 10వేల ఒంటెలను చంపేస్తున్నారని తెలియడంతో జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
గ్లోబల్ వార్మింగ్ కారణంగా మిథేన్ వాయువును ఒంటెలు భారీగా విడుదల చేస్తున్నాయట.. అది అడవులు అంటుకోవడానికి కారణమవుతున్నాయట.. 9 ఏళ్లలోనే ఒంటెల సంతతి రెట్టింపయ్యిందట.. అందుకే వీటి కారణంగా నష్టం వాటిల్లుతుండడంతో ఒంటెలను చంపడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇది ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది.