ఫిల్మ్ క్రిటిక్ మహేష్ కత్తికి, మెగా ఫ్యాన్స్ కు మధ్య కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ అభిమానులకు, మహేష్ కు మధ్య ఫోన్లలో, లైవ్ డిబేట్లలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత మహేష్ పై జబర్దస్త్ స్కిట్ లో ముందు పొట్ట, వెనుక బట్ట అంటూ హైపర్ ఆది పంచ్ డైలాగులు పేల్చాడు. దానిపై మహేష్ స్పందించి ఆది, జబర్దస్త్ షోపై కామెంట్లు చేశాడు. ఆ తర్వాత వారిద్దరూ ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను మహేష్....ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి....మేము...మేము కలిసే ఉంటాం....బయట వారు గొడవపడతారు అంటూ కామెంట్ పెట్టాడు. ఆ తర్వాత వీరిద్దరూ లైవ్ షోలలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. మహేష్ ప్రవర్తన, కామెంట్ల వల్లే పవన్ అభిమానులు ఆయనను టార్చర్ చేస్తున్నారని హైపర్ ఆది అన్నాడు.
ఆ షోతో వారిద్దరి మధ్య వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. అయితే, తాజాగా మరోసారి హైపర్ ఆదిపై మహేష్ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టాడు. హైపర్ ఆదిపై కేసు నమోదు అంటూ మహేష్ పోస్ట్ చేయడంతో మరోసారి కాంట్రవర్సీ మొదలైంది. ‘‘అనాధ పిల్లలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకుగానూ బాలల హక్కులు మరియు మానవ హక్కుల ఉల్లంఘన కింద హైపర్ ఆది మరియు జబర్ధస్త్ పై కేసు నమోదు చేస్తున్న అనాధ పిల్లలు. నా ఫుల్ సపోర్ట్ వారికే’’ అంటూ మహేష్ కత్తి పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చేయడానికి ముందు మహిళా సంఘాలతో కలిసి జబర్ధస్త్ షోని ఉద్దేశించి ‘‘ఏది బూతు, ఏది కామెడీ’’ అనే డిబేట్ లో మహేష్ పాల్గొన్నాడు. మరి మహేష్ వ్యాఖ్యలకు ఆది స్పందన ఏవిధంగా ఉంటుందో అన్న సంగతి ఆసక్తికరంగా మారింది.