తీవ్ర కలకలం రేకెత్తించిన అనంతరం సద్దుమణిగిన జల్లికట్టు గురించి తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం షాకింగ్ విషయాలు చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జల్లికట్టు ఉద్యమం ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు పోలీసు బలగాలను ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి సెల్వం వివరణ ఇచ్చారు. జల్లికట్టు ఉద్యమంలో పాల్గొన్న వారిలో కొందరు తమిళులు ప్రత్యేక తమిళదేశం కావాలని డిమాండ్ చేశారని తెలిపారు. అంతేకాకుండా నిరసనకారులు ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఫొటోలు కూడా చూపించారని సెల్వం వివరించారు. అంతేకాకుండా గణతంత్ర్య దినోత్సవాన్ని కూడా బహిష్కరించాలని డిమాండ్ చేశారని అందుకే పోలీసులు రంగ ప్రవేశం చేశారని సభా వేదికగా పన్నీర్ సెల్వం తెలిపారు.
జల్లికట్టు ఉద్యమంపై నిషేధాన్ని ఎత్తివేసే వరకు ఉద్యమం కొనసాగిద్దామని కొందరు రెచ్చగొట్టారని, అవసరమైతే రిపబ్లిక్ డేను బహిష్కరించాలనే పిలుపు ఇవ్వడంతో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని బావించిన పోలీసులు రంగ ప్రవేశం చేశారని పన్నీర్ సెల్వం అసెంబ్లీలో వివరించారు. అందుకే దురుద్దేశపూర్వకంగా నల్ల జెండాలు ప్రదర్శిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారని ఆయన వివరించారు. ఈ విషయం తాను ప్రమాణ పూర్తిగా చెప్తున్నట్లు సభలో ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటన సహేతుకంగా లేదని ప్రతిపక్ష డీఎంకే సభ్యులు వాకౌంట్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/