కారణాలు ఏవైనా కూడా తాము అనుకున్నది జరగకపోతే కొందరు పగబట్టి , ప్రతీకారం తీర్చుకోవడానికి రగిలిపోతున్నారు. నర హంతకులుగా మారుతున్నారు. కొందరు అయినవాళ్లనే అంతమొందిస్తుండగా, మరికొందరు డబ్బులు ఇచ్చి కిల్లర్స్ ద్వారా దారుణంగా హత్య చేయిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పహాడీషరీఫ్ పరిధిలో దారుణ హత్యకు గురైన యువతి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. మృతురాలిని ఎవరూ గుర్తుపట్టకుండా బండరాయితో ముఖాన్ని ఛిద్రం చేశారు హంతకులు. పోలీసులు మృతురాలి ముఖానికి కుట్లువేయించి ఒక రూపాన్ని తీసుకొచ్చినా ఇంతవరకూ ఎవరూ గుర్తించలేదు. దాంతో పోలీసులు ఆమె ముఖంతో రూపొందించిన పోస్టర్ రిలీజ్ చేసి అన్ని ప్రాంతాలకూ పంపారు. హంతకులు, ఘరానా నేరగాళ్లు నగర శివారు ప్రాంతాలను నేరాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో మద్యం తాగి , ఒంటరి మహిళలను ఇతర ప్రాంతాల నుంచి ఎత్తుకొచ్చి సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత వారిని అతి కిరాతకంగా అంతమొందిస్తున్నారు.
నగరం చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన నిందితులు మహిళలు/పురుషులను ఎక్కడో హత్యచేసి వాహనాల్లో తీసుకొచ్చి శివారు ప్రాంతాల్లో పడేసి వెళ్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల శివారు ప్రాంతాల్లో కాలిన స్థితిలో, గుర్తుపట్టలేని స్థితిలో పోలీసులకు లభ్యమైన మృతదేహాల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం గమనార్హం. 2018 మార్చిలో.. తొండుపల్లి శివారు ప్రాంతంలో సగానికి పైగా కాలిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో మహిళ మృతదేహం లభించింది. ఇప్పటి వరకు ఆమె ఆచూకీ లభించలేదు. చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధి శివారు ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశంలో గతేడాది ఏప్రిల్ లో యువతి మృతదేహం లభించింది. ఆ మృతదేహం కూడా కాలిపోయిన స్థితిలోనే ఉంది. ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. ఈ ఘటనలన్నీ శివారు ప్రాంతాల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీస్ నిఘాను, సీసీటీవీ కెమెరాలను పెంచాల్సిన అవసరం ఉంది.
ఇటీవల నగర శివారు ప్రాంతాల్లోని చెట్లపొదలు, జాతీయ రహదారుల పక్కన నిర్మానుష్య ప్రాంతాలు, బ్రిడ్జిల కింద, శివారు చెరువుల వద్ద మహిళలను అత్యంత దారుణంగా హత్యచేసి కాల్చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం మహిళలే కాదు.. వివాహేతర సంబంధాలు, భూ వివాదాలు, పాతకక్షల నేపథ్యంలో మగాళ్లను చంపేందుకు కూడా శివారు ప్రాంతాలనే దుండగులు ఎంచుకుంటున్నారు. వరుస ఘటనలు శివారు ప్రాంతాల్లోని ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఏడాది క్రితం దిశా సంఘటన దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే.