కరోనా మహమ్మారి బ్రిటన్ లో కరాళ నృత్యం చేస్తోంది. మరీ ముఖ్యంగా యూకేపై పంజా విసురుతోంది. ఇటీవల తగ్గినట్లే తగ్గిన వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. సెకండ్ వేవ్ తర్వాత కేసులు తగ్గుతూ వచ్చాయి. అయితే గడిచిన రెండు వారాల నుంచి మళ్లీ శరవేగంగా పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య వేల నుంచి లక్షలకు పాకింది. మహమ్మారి కోరలు చాస్తూ... దాదాపు రెండేళ్లు కావొస్తుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా యూకేలో మొత్తం 11 మిలియన్ల మందికి కరోనా సోకింది. ఇక 147,573 మంది వైరస్ ధాటికి బలయ్యారు.
దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్... దాదాపు అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతూ వస్తోంది. బ్రిటన్ లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఐరోపా దేశాల్లోని యూకేలో కేసుల సంఖ్య అధికంగా నమోదు అవుతోంది. గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్ ని దాటింది. బుధవారం యూకే ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదికలో ఒక్కరోజులోనే 106,122మందికి వైరస్ సోకినట్లుగా వెల్లడైంది. యూకేలో 37,101మందిలో ఒమిక్రాన్ గుర్తించినట్లు ధ్రువీకరించారు. ఇది చూస్తుంటే ఆ దేశం త్వరలోనే మరో వేవ్ ను ఎదుర్కొవాల్సి రావచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.
కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం వల్ల వ్యాక్సినేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక బూస్టర్ డోసులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. బూస్టర్ డోసు తీసుకునే వారి సంఖ్య ఇటీవల ఎక్కువైంది. దాదాపు ముప్పై మిలియన్ల మంది ఈ బూస్టర్ డోసును తీసుకున్నట్లు సమాచారం. కాగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని యూకే ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు. వైరస్ ఎదుర్కొనే శక్తిని అందరికీ కలిగించాలనే ఉద్దేశంతో టీకా పంపిణీని వేగంవంతం చేశామని ఆయన వెల్లడించారు.
ఇకపోతే ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం యూకేపై అధికంగా ఉండనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే వెల్లడించింది. కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ దేశాలపై దీని ప్రభావం ఉంటుందని పేర్కొంది. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్ ప్రపంచ దేశాల్లోకూ విస్తరిస్తోంది. కాగా రాబోయే మూడు నెలలు గడ్డుకాలం అని వైద్యారోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. జెట్ స్పీడ్ తో వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఈ ఒమిక్రాన్ వేరియంట్ వల్ల... అనేక రంగాలు సంక్షోభంలో పడే అవకాశం ఉందని అంటున్నారు. కాగా వివిధ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ వేరియంట్ ను ఎదుర్కొవడానికి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఏకంగా 25 కేసులు నమోదు కాగా... ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు రెండు కేసులను గుర్తించారు.