కేసీఆర్ కి ప్రేమ, కోపమూ రెండు ఎక్కువే. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అనే మాట మీద నిలబడి ఉన్న కేసీఆర్ బహిరంగంగానే ముస్లింల అభివృద్ధికి కలిసి రండి అంటూ ఒవైసీ బ్రదర్స్‌కు స్నేహ హస్తం చాటారు. బహుశా ఒవైసీ బ్రదర్స్‌ను ఇంత సానుకూలంగా చూసిన వాళ్లు చాలా తక్కువ. వారు కూడా తమ ప్రయోజనాలు అన్నిరకాలుగా పొందినంత కాలం కేసీఆర్‌ను పొగిడారు. ఇపుడు ఎన్నికలు వచ్చేసరికి తమ విశ్వరూపం చూపిస్తున్నారు.
అన్న అసద్ ఏమో... గుడ్డి మామ కంటే ఒంటి కన్ను మామ బెటర్ అంటూ కేసీఆర్ మీద సెటైర్లు వేశారు. తమ్ముడు అక్బర్ ఏమో ఎన్నికల అనంతరం ఏ ముఖ్యమంత్రి అయినా మా కాళ్ల వద్దకు రావల్సిందే న్నాడు. ఈరోజు తాజాగా కేసీఆర్‌కు తెలంగాణకు మాకు మంచే చేశాడు. కానీ ఓడిపోతే మాత్రం ఆయన బీజేపీతో కలుస్తారు అని వ్యాఖ్యానించారు. ఇటీవలే బీజేపీ-ఎంఐఎం- టీఆర్ఎస్ ఒకటే అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటి ప్రభావం తమ మీద ఉండకుండా ఒవైసీ బ్రదర్స్ ఈ కామెంట్లు చేస్తున్నారేమో అని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాకపోతే... కేసీఆర్ పెళ్లి సాయం పథకంతో ముస్లింలు కేసీఆర్ వైపు వన్ సైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎంఐఎం పోటీ చేస్తున్న చోట వారికి ముస్లింలు మొగ్గుచూపినా... ఇతర నియోజకవర్గాల్లో ఎవరు చెప్పినా చెప్పకపోయినా ముస్లిం ఓటర్లు కేసీఆర్ వైపు ఉండే అవకాశం ఉంది.