డిసెంబర్ చివరినాటికి భారత్ కు ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్

Update: 2020-08-19 15:30 GMT
ఇప్పుడు ప్రపంచం మొత్తం చూపు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనే దానిపైనే.. ఇప్పటికే వ్యాక్సిన్‌ ను తయారు చేసి రిలీజ్ చేశామని రష్యా చెబుతున్నప్పటికీ, దానిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఆ టీకాను ఏ దేశం కూడా తీసుకోవడం లేదు. రెండు క్లినికల్ ట్రయల్స్ కే ఆ టీకా విడుదల చేయడంతో దాని పనితీరుపై అందరిలోనూ అనుమానాలున్నాయి. ప్రస్తుతం అత్యంత మెరుగైన ఫలితాలు వస్తున్న ఆక్స్ ఫర్డ్ టీకాపైనే అందరి దృష్టి నెలకొంది. భారత్ లో కూడా ఈ టీకా పరీక్షలు జరుగుతున్నారు. పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ సహకారంతో అభివృద్ధి చేస్తున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్‌ను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ గురించి తాజా సమాచారం ప్రకారం.. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి భారతీయులకు అందుబాటులో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్ బయోటెక్.. జైడస్ కాడిలా వ్యాక్సిన్లు ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ చేస్తూ అభివృద్ధి దశలో ఉన్నాయి. భారత్ లో తయారు చేస్తున్న వ్యాక్సిన్లతో పోలిస్తే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ మూడో ట్రయల్స్ లోకి ప్రవేశించి ఫైనల్ పరీక్షలు చేస్తోంది.

ఆక్స్ ఫర్డ్ -సీరం వ్యాక్సిన్ 3 దశ లో ఉంది. భారత్ కంపెనీల వ్యాక్సిన్లు మొదటి రెండో దశలో మాత్రమే ఉన్నాయి. ఆక్స్ ఫర్డ్ టీకా 17 ఎంచుకున్న దేశాల్లో 1600 చోట్ల దిగ్విజయంగా పరీక్షలు జరుపుతోంది. ఈ టీకా ప్రాథమిక ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి.

మొత్తంగా భారతదేశంలో డిసెంబర్ చివరి నాటికి ఈ ఆక్స్ ఫర్డ్ టీకా అందుబాటులోకి రానుందని ప్రయోగ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఆక్స్ ఫర్డ్ టీకా 100శాతం రోగనిరోధక శక్తిని పెంచుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆశలు పెంచుతోంది.
Tags:    

Similar News