మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి బ్యాడ్ న్యూస్. మన్మోహన్ సింగ్ సర్కారులో కీలక భూమిక పోషించిన చిదంబరం మాటకు తిరుగులేకుండా ఉండేది. ఆయన పవర్ అప్పట్లో హాట్ న్యూస్ గా ఉండేది. ఢిల్లీ వర్గాల్లో ఆయన పరపతి ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చేతిలో అధికారం ఉన్న వేళ.. దాన్ని దుర్వినియోగం చేసేలా వ్యవహరించినట్లుగా ఆయనపైనా.. ఆయన కుమారుడిపైనా ఆరోపణలు ఉన్నాయి.
ఈ వాదనల్ని బలపర్చేలా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. చిదంబరం కుమారుడు కార్తి చిదంబరాన్ని తాజాగా సీబీఐ అరెస్ట్ చేసింది. ఐఎన్ ఎక్స్ మీడియా వ్యవహారంలో ఫెరా రూల్స్ ను ఉల్లంఘించినట్లుగా కార్తి మీద ఆరోపణలు ఉన్నాయి. బుధవారం ఉదయాన కార్తిని అరెస్ట్‌చేసినట్లు సీబీఐ వెల్లడించింది.
ఈ రోజు ఉదయం లండన్ నుంచి చెన్నైకి చేరుకున్న కార్తిని ఏడుగురు సభ్యుల బృందంగా ఉన్న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఫెమా నిబంధనల్ని ఉల్లఘించిన కేసు విచారణలో కార్తి సహకరించటం లేదన్న వాదనలు ఉన్నాయి. ఇక.. ఐఎన్ ఎక్స్ మీడియా డైరెక్టర్లుగా పీటర్.. ఇంద్రాణి ముఖర్జీలతో సహా నిందితులపై ఇప్పటికే ఫిర్యాదులు నమోదు చేశారు. కేంద్రంలో ఒక వెలుగు వెలిగిన చిదంబరం కొడుకును సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన తీరు చూస్తే.. తప్పులు చేస్తే తిప్పలు తప్పవన్న విషయం మరోసారి రుజువైందని చెప్పక తప్పదు.