ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప్పు నిప్పుగా ఉన్న వైసీపీ-టీడీపీ నేతలు సఖ్యతకు వచ్చారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అతి దగ్గరగా ఉండే ఎంపీ - టీడీపీ అధినేత-ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు అయిన మంత్రి చేతులు కలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ ఇద్దరు నేతల ప్రాంత విశిష్టత నాయకులను ఒక్కతాటిపైకి చేర్చింది.
నెల్లూరు నగర శివారులో ఫ్లెమింగో ఫెస్టివల్ పేరిట జరిగిన 2కే రన్ కలర్ ఫుల్ గా సాగింది. ట్రాక్ సూట్ వేసిన ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ యువతతో కలిసి రోడ్డుపై పరుగులు పెట్టారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా అరుదైన దృశ్యం కూడా కనిపించింది. నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఆదినుంచి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ సీనియర్ నేత - ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి - టీడీపీకి చెందిన మంత్రి నారాయణతో కలిసి మీడియా కెమెరాల ముందు తళుక్కున మెరిశారు. నారాయణతో కరచాలనం చేసిన మేకపాటి ఆద్యంతం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాకు రూ.60కోట్లు మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. ఈనెల 9, 10 తేదీల్లో జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా నెల్లూరు నగరంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఫ్లెమింగో పక్షులు ప్రాంతీయ సౌబృతత్వాన్ని పెంచేందుకు నెల్లూరుకు వలస వస్తుంటాయి. ఆ పక్షుల సౌందర్యం సాక్షిగా రాజకీయ ప్రత్యర్థులు కులాసా వాతావరణంలో అడుగులు వేయడం హర్షం కలిగించిందని నెల్లూరు వాసులు అంటున్నారు.