ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో ఆయన ఒక మంత్రి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడనే పేరుంది. గతంలో, ఇప్పటికీ కూడా కార్పొరేట్ విద్యను శాసిస్తున్నారు. ఏపీ సర్కారు కీలకంగా భావిస్తున్న రాజధాని నిర్మాణంలోనూ ఆయనది బాబు తర్వాతి స్థానం. ఇంతటి కీలక నేత కన్ను ఇప్పుడు ఆర్టీసీపై పడింది. రవాణ రంగంలోకీ అడుగుపెట్టిన ఆర్టీసీలో అద్దె బస్సులు తిప్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అది కూడా పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు చెందిన తనకు అత్యంత సన్నిహితుడైన మహబూబ్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి పేరుతో కావడం విశేషం.
మంత్రి అండదండలతో సదరు వ్యక్తి గ్లోబల్ ట్రాన్స్‌పోర్టు కంపెనీ పేరుతో 400కు పైగా ఇంద్ర - హైటెక్ అద్దె బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టేందుకు టెండరు దక్కించుకున్నారని అంటున్నారు. రాబోయే కాలంలో మరో 500 బస్సులను ఆర్టీసీలో అద్దెకు ప్రవేశపెట్టేందుకు తెరవెనుక పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతి మంగళం ఆర్టీసీ డిపో నుంచి 'బెంగుళూరు - తిరుపతి' - 'విజయవాడ - తిరుపతి' రూట్లలో ఏడు ఇంద్ర ఏసీ సర్వీసులు నడుస్తున్నాయి. వీటికితోడు మరో ఐదు ఇంద్ర బస్సులు బెంగుళూరుకు తిప్పేందుకు ట్రాన్స్‌పోర్టు సంస్థ పేరుతో టెండర్లు దక్కించుకున్నారు. నెల్లూరు - కడప - అనంతపురం - కర్నూలు జిల్లాల్లో హైటెక్ బస్సులూ ఆయనకు చెందినవే. 'చెన్నరు- విజయవాడ' - 'విజయవాడ - విశాఖపట్నం' - 'విజయవాడ - హైదరాబాద్' - 'విజయవాడ - బెంగుళూరు' - 'విజయవాడ - మధురై' వంటి సుదూర ప్రాంతాలకు తిరిగే ఇంద్ర బస్సులు ఎక్కువ భాగం ఆ ట్రాన్స్‌పోర్టు కంపెనీకి చెందినవే కావడం గమనార్హం.
జులైలో ఆర్టీసీలో అద్దె బస్సుల టెండర్లను దక్కించుకున్న ఆ ట్రాన్స్‌పోర్టు సంస్థ ఆగస్టు నుంచి ఇంద్ర - హైటెక్ బస్సులను రోడ్డెక్కించింది. ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేట్ విద్య పేరుతో - విద్యా వ్యాపారం పేరుతో ప్రభుత్వ స్కూళ్లే కాకుండా, చిన్నాచితక, మధ్యతరహా ప్రైవేట్ స్కూళ్లను, కళాశాలలను దెబ్బతీసి కోట్లకు పడగలెత్తిన ఆ నేత ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేతకు చెందిన విద్యా సంస్థల బస్సులకు మెకానిక్‌గా ఉన్న మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తి ఇప్పుడు ఆ ట్రాన్స్‌పోర్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,700 అద్దె బస్సులు ఉంటే లాభాలొచ్చే రహదారుల్లో 400 బస్సులు ఆ ట్రాన్స్‌పోర్టువే కావడం గమనార్హం. భవిష్యత్తులో మరో 500 బస్సులు ఆ ట్రాన్స్‌పోర్టు ద్వారా ప్రవేశించనున్నాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెపుతున్నారు. అద్దె బస్సుల వల్ల నష్టాలను చూపించి ఆర్టీసిని ప్రయివేటుపరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని ఆర్టీసీ వర్గాల్లో వినవస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/