ఏపీ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర మంత్రులకు ఇచ్చిన ర్యాంకుల రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ ఎపిసోడ్‌పై సహజంగానే ప్రతిపక్షాలు తమ కామెంట్లు వినిపించగా మంత్రులు సైతం అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులో పురపాలక శాఖ మంత్రి నారాయణ బహిరంగంగా బయటపడ్డారు. అయితే తొందర్లోనే సర్దుకొని మాటమార్చారు. ఇంతకీ మంత్రి నారాయణ ఏమన్నారో చూడండి!
మంగళవారం ఉదయం 9గంటలకుః నిన్న ప్రకటించిన మంత్రుల ర్యాంకులన్నీ అవాస్తవం. అవి తప్పుడు ర్యాంకులు.ముఖ్యమంత్రి ప్రకటించిన ర్యాంకులు కాదు. ఆ సర్వేలు ఏ ప్రాతిపదికన, ఎవరు తయారు చేశారో తెలియదు.నేను చిత్తూరు జిల్లా ఇంఛార్జీ మంత్రిగా ఉన్నపుడే నాకు ఐదో ర్యాంకు వచ్చింది. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం నేను ఐదో ర్యాంకులో ఉన్నాను.
మంగళవారం సాయంత్రంః ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన ఉత్తమ మంత్రులలో నాకు చివరి ర్యాంకు రావడం పట్ల బాధపడటం లేదు. కొన్ని ప్రమాణాలతో పార్టీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. ర్యాంకులను పాజిటివ్‌గా తీసుకున్నాను. పొరపాట్లను సమీక్షించుకుని ముందుకు సాగుతాను.