తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏదో ఒక రీతిగా జనాన్ని బురిడీ కొట్టించడానికే తన వంతుగా కృషి చేస్తున్నదని జనంలో విపరీతంగా ఆరోపణలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. జనం గురించి పట్టించుకోకుండా, తమకు తోచినదేదో చేసుకుంటూ పోతున్నారని.. సంక్షేమం మీద ధ్యాసలేదని జనం ఆరోపించుకుంటూ ఉన్నారు. అయితే విధానాల్ని ప్రశ్నించిన ప్రతిసందర్భంలోనూ.. ప్రగతికి అడ్డు పడుతున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను ఆడిపోసుకోవడం తెలుగుదేశం ప్రభుత్వానికి ఓ ఆటగా మారిపోయింది.
ఇప్పుడు మంత్రి నారాయణ కూడా అదే పని చేస్తున్నారు. ప్రజల్ని వంచించడానికి తెలుగుదేశం సర్కారు అనుసరిస్తున్న కొన్ని వక్రమార్గాలను ఎత్తిచూపిస్తే.. వాటికి జవాబులు చెప్పడానికి చేతకాకుండా.. డొంకతిరుగుడు సమాధానాలు ఇస్తున్నారని, ఎదురుదాడి ఆరోపణలకు దిగుతున్నారని ప్రజలు అంటున్నారు.
రాజధాని కి భూములు ఇచ్చిన రైతులతో కుదుర్చుకునే అగ్రిమెంట్లలో ఫారం-2 ను తెలుగులో ప్రింట్ చేయలేదని వైకాపా ఆరోపించింది. అందులో చాలా వంకర నిబంధనలు ఉన్నాయని, జనానికి అవి అర్థం కాకుండా ఉండేందుకు, తెలుగులో కాకుండా ఇంగ్లిషులో వేశారనేది వారి ఆరోపణ. అయితే దీనికి మంత్రిగారు స్పందిస్తూ.. ''రైతులకు అర్థమయ్యే సులువైన భాషలోనే ముద్రించాం'' అని సెలవిచ్చారు. అంటే డాక్టరేటు చేసిన మంత్రిగారికి ఇంగ్లిషు సులువైన భాష అనిపించవచ్చు గానీ.. పాపం.. మట్టి పిసుక్కుని బతికే మామూలు రైతులకు ఏం తెలుస్తుంది? అనేది జనం ప్రశ్న.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/