పవన్ ట్వీట్ మంత్రంలా పని చేస్తుందా? అంటే అవుననే చెబుతున్నారు. గురువారం ఆయన ఏపీ రాజధాని భూములు సేకరణ కోసం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దని ట్విట్టర్ ద్వారా చెప్పటం తెలిసిందే. పవన్ చేసిన ట్వీట్ పై ఏపీ రాజధాని వ్యవహారాలు చూస్తున్న మంత్రి నారాయణ స్పందించారు.
రాజధాని నిర్మాణం కోసం జరిపే భూసేకరణ విషయంలో పవన్ కల్యాణ్ కోరినట్లే వ్యవహరిస్తామని.. భూసేకరణ చట్టం అమలు చేయకుండా భూసేకరణ పనులు పూర్తి చేస్తామని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఆశించిన విధంగానే ఏ రైతును ఇబ్బంది పెట్టకుండా ల్యాండ్ పూలింగ్ చేస్తామని చెప్పిన నారాయణ.. పవన్ ట్వీట్ తమకు లక్ష్మణ రేఖ అన్నట్లుగా చెప్పుకొచ్చారు.
రాజధాని కోసం గతంలో భూసేకరణ సమయంలో భూములు ఇవ్వని రైతుల నుంచి ఆగస్టు 20 నుంచి భూమిని సేకరిస్తామని చెప్పిన ఆయన.. ఎలాంటి వివాదం చోటు చేసుకోకుండానే భూసేకరణను పూర్తి చేస్తామని చెప్పటం గమనార్హం. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోకుండా.. సామరస్య వాతావరణంలోనే ఏపీ సర్కారు వెళ్లాలని తాను ఆశిస్తున్నట్లు పవన్ ఇచ్చిన ట్వీట్ కు ఏపీ సర్కారు తరఫున మంత్రి నారాయణ స్పందించారు.
మొత్తానికి మాట మాట్లాడకుండా కేవలం తన ట్వీట్ తోనే తాను కోరుకున్న విధానాలు అమలు అయ్యేలా చేసుకోవటంలో పవన్ సక్సెస్ అవుతున్నారా? లేక.. పవన్ మనసు నొచ్చుకోకుండా ఉండేలా తెలుగు తమ్ముళ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.