నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ కొత్త కొత్త పరిణామాలు తెరమీదకు వస్తున్నాయి. ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అమరావతి నిర్మాణం కోసం చేపట్టవల్సిన చర్యల గురించి అడుగులు వేస్తుంటే...క్షేత్రస్థాయిలో చిక్కులు తెరమీదకు వస్తున్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్ పై రైతుల నుంచి వ్యతిరేకత వస్తుండటం ఏపీ ప్రభుత్వానికి తాజా తలనొప్పిగా మారింది. ఈ హీట్ ఏకంగా సింగపూర్ కు చేరింది.
రాజధాని మాస్టర్ ప్లాన్ అన్నిపక్షాలకు అనుకూలంగా లేదనే భావన ఇటీవలి కాలంలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. రాజధాని నిర్మాణం పనుల విషయంలో సింగపూర్ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి నారాయణ అక్కడ మాస్టర్ ప్లాన్ పై చర్చించారు. మంత్రి నారాయణ - రాజధాని ప్రాంత ప్రాధికారసంస్థ (సిఆర్ డిఎ) కమిషనర్ ఎన్ శ్రీకాంత్ సింగపూర్ బృందంతో భేటీ అయ్యారు. సర్బానా కంపెనీ ప్రతినిధులతో మాస్టర్ ప్లాన్ లో ఎక్స్ ప్రెస్ వేతో పాటు ప్రధాన రహదారులు, గ్రామ కంఠాలు తదితరాల గురించి చర్చించారు.
ఈ క్రమంలో రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ మంత్రి నారాయణ సింగపూర్ నుంచి ప్రకటన విడుదల చేయడం విశేషం! రాజధాని మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమేనని, రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలో మార్పులు చేస్తామని మంత్రి వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ పై రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాలను, సమస్య జటిలంగా ఉన్న ప్రాంతాలలో ప్రత్యామ్నాయాలను చూడాలని సర్బానా ప్రతినిధులకు చెప్పామని నారాయణ వివరించారు. రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు. రాజధాని గ్రామాలలో నిర్వహించిన అవగాహన సమావేశాలలో వచ్చిన అభ్యంతరాలు, అభిప్రాయాలను క్రోడీకరించి సింగపూర్ కంపెనీ సర్బానాకు అందజేసిన నేపథ్యంలో తగు మార్పులు తప్పకుండా ఉంటాయాన్నారు.