విధి ఎంత చిత్రమో... కొందరు టీడీపీ నాయకులను చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. గతంలో గుమ్మం వరకు కూడా కారులో వెళ్లిన నాయకులు.. కనీసం అడుగు తీసి అడుగు వేయాలంటే.. లక్ష సార్లు ఆలోచించిన మాజీ మంత్రులు.. ఇప్పుడు రోడ్డు వెంటబడి ఎండనక, వాననక కష్ట పడుతున్నారు. దీనికి కారణం వచ్చే ఎన్నికలే! ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతిపక్షాల తరఫున బరిలో నిలవాలని భావిస్తున్న నాయకుల పరిస్థితి అంత ఈజీ అయితేకాదు.
అందుకే, నాయకులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజ కవర్గంలో ఇప్పుడు ఎటు చూసినా పెద్ద ఎత్తున "రైతు కోసం పాదయాత్ర" అనే నినాదాలతో కూడిన భారీ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. అంతేకాదు.. 'సునీతమ్మ పాదయాత్ర' అనే పెద్ద ఎత్తున అక్షరాలతో కూడిన బ్యానర్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని రోజులుగా మాజీ మంత్రి సునీత పాదయాత్ర చేస్తున్నారు. రైతుల కోసం ఆయన నడుస్తున్నారు.
అయితే, ఈ యాత్ర కేవలం రాప్తాడు నియోజకవర్గంవరకే పరిమితం కావడం గమనార్హం. ఇదిలావుంటే, అసలు సునీత ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు? అంటే, వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కేందుకే. ఇక్కడ కూడా ఒక ధర్మ సందేహం ఉంది. గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి ఆమె కుమారుడు శ్రీరాం పోటీ చేసి పరాజయం పాలయ్యారు. మరి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఆయనను గెలిపించుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారా? అనేది ప్రశ్న.
కానీ, వాస్తవం ఏంటంటే ఆకలేసినవాడే అన్నం తినాలి! అంటే వచ్చేఎన్నికల్లో ప్రజల్లో నుంచి గెలవాలను కునేవారే ప్రజల మధ్యకు వెళ్లాలి. కానీ, ఇక్కడ పరిటాల శ్రీరాం మాత్రం ధర్మవరంలో చక్రం తిప్పుతు న్నారు. ఇక్కడ రాప్తాడులో మాత్రం మాజీ మంత్రి సునీత పాదయాత్ర చేస్తున్నారు. ఈమెకు బాగానే ఫాలోయింగ్ కనిపిస్తోంది. అయితే, అసలు ఒక్క సీటు ఇస్తానని చంద్రబాబు చెబుతుంటే.. రెండు సీట్లపై కన్నేసి ఇలా చేస్తుండడం.. ఆశ్చర్యానికి గురి చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.