ప‌ద్మ‌శ్రీ లిస్ట్ ఎంత పెద్ద‌దంటే..?

Update: 2019-01-26 05:14 GMT
గ‌ణ‌తంత్ర దినోత్స‌వానికి ముందు రోజు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఉంటుంది. జ‌న‌వ‌రి 25న ప‌లురంగాల్లో విశిష్ట కృషి చేసిన ప‌లువురికి ప‌ద్మ‌శ్రీ పేరిట గుర్తించటం జ‌రుగుతుంటుంది.దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్ర‌తిపాద‌న‌ల్ని వ‌డ‌బోసి.. వివిధ అంశాల్ని దృష్టిలో పెట్టుకొని ప‌ద్మ‌శ్రీ పుర‌స్కార జాబితాను ప్ర‌క‌టిస్తుంటారు.

ఈ ఏడాది అదే తీరులో ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాల్ని ప్ర‌క‌టించారు. మొత్తం 94 మంది ప‌ద్మ‌శ్రీ‌ ల‌కు ఎంపిక చేయ‌గా.. వారిలో తెలుగువారు న‌లుగురు మాత్ర‌మే.అయితే.. ఈ న‌లుగురు వివిధ రంగాల‌కు చెందిన వారు. సుప్ర‌సిద్ద సినీ గేయ ర‌చ‌య‌త‌.. తెలుగు వాడిగా పుట్ట‌టం మాత్ర‌మే ఆయ‌న చేసిన నేరంగా ప‌లువురు అభిమానంతో చెప్పే సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి ఇన్నేళ్ల త‌ర్వాత ఈసారి ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం ల‌భించింది.

ఒక‌వేళ సీతారామ‌శాస్త్రికానీ తెలుగువాడు కాకుంటే.. ఆయ‌న‌కు ద‌క్కే పేరు ప్ర‌ఖ్యాతులు మ‌రోలా ఉండేవి అన‌టంలో సందేహం లేదు. టాలెంట్ ఉన్న‌ప్ప‌టికీ పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌టం.. అలాంటి వారికి ప్ర‌భుత్వాలు ద‌న్నుగా నిల‌వ‌టం లాంటివి ఉండ‌వు. ఈ కార‌ణంతోనే సీతారామ‌శాస్త్రికి ఎప్పుడో రావాల్సిన ప‌ద్మ‌శ్రీ ఇప్ప‌టికి వ‌చ్చింది.

ఇక‌.. ప్ర‌ముఖ చ‌ద‌రంగ క్రీడాకారిణి ద్రోణ‌వ‌ల్లి హారిక‌.. రైతునేస్తం వ్య‌వ‌స్థాప‌కుడు య‌డ్ల‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర‌రావు.. ఫుట్ బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రికి ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాల‌కు ఎంపిక‌య్యారు. అదే స‌మ‌యంలో హైద‌రాబాద్‌ లో చ‌దివి అమెరికాలో స్థిర‌ప‌డ్డ టెక్ దిగ్గ‌జం శంత‌ను నారాయ‌ణ్ కు ప్ర‌వాస భార‌తీయుల కోటాలో ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం ల‌భించింది. మొత్తంగా ప్ర‌క‌టించిన 94 ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాల్లో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారు న‌లుగురు కావ‌టం గ‌మ‌నార్హం. 

ఈసారి ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారానికి ఎంపికైన 94 మందిని చూస్తే..

ద్రోణ‌వ‌ల్లి హారిక‌
య‌డ్ల‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర‌రావు
సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి
సునీల్‌ ఛెత్రి
ప్ర‌భుదేవా
శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ నారాయ‌ణ్‌
శంత‌ను నారాయ‌ణ్‌
రామ‌స్వామి వెంక‌ట‌స్వామి
దేవ‌ర‌ప‌ల్లి ప్ర‌కాశ్‌రావు
గౌత‌మ్ గంభీర్‌
అబ్దుల్ గ‌ఫార్ ఖాత్రి
గీతా మెహ‌తా
రాజేశ్వ‌ర్ ఆచార్య‌
బంగారు ఆడిగ‌లార్‌
ఎలియాస్ ఆలీ
మ‌నోజ్ బాజ్‌పాయి
ఉద్ధ‌బ్‌ కుమార్ భారాలి
ఉమేశ్ కుమార్ భార‌తి
ప్రిత‌మ్ భ‌ర‌త్‌వాన్‌
జ్యోతి భ‌ట్‌
దిలీప్ చక్రవర్తి
మ‌మ్మెన్ చాందీ
స్వ‌ప‌న్ చౌద‌రి
కన్వల్ సింగ్ చౌహాన్
దిన్‌యార్ కాంట్రాక్ట‌ర్‌
ముక్తాబెన్ పంక‌జ్‌కుమార్ ద‌గ్లీ
బాబులాల్ దహియా
తంగా దర్లోంగ్
రాజ‌కుమారి దేవి
భ‌గీర‌థి దేవి
బ‌ల్‌దేవ్ సింగ్ ధిల్లాన్‌
గోదావరి దత్తా
గౌతమ్‌ గంభీర్‌
ద్రౌపది ఘిమిరే
రోహిణి గాడ్‌బోలే
సందీప్ గులేరియా
ప్రతాప్ సింగ్ హార్దియా
బులు ఇమామ్
ఫ్రెడిరైక్‌ ఇరినా
జోర్వార్‌సింగ్ జాద‌వ్‌
కన్వల్ సింగ్ చౌహాన్
ఎస్‌. జ‌య‌శంక‌ర్‌
న‌ర్సింగ్ దేవ్ జ‌మ్వాల్‌
ఫయాజ్ అహ్మద్ జాన్
కేజీ జ‌య‌న్‌
సుభాష్ క‌క్‌
శరత్ కమల్
ర‌జినీకాంత్‌
సుధామ్ కాటే
వామన్ కేండ్రే
ఖ‌దీర్ ఖాన్‌
అబ్దుల్ గఫూర్ ఖత్రి
రవీంద్ర కోలే
స్మితా కొలే
బాంబేలా దేవి లాయిష్రం
కైలాష్ ఎం
రమేశ్‌ బాబాజీ మహారాజ్
వ‌ల్ల‌భ‌భాయ్ వ‌స్రంభాయ్ మార్వానీయా
గీతా మెహతా
షాదబ్ మ‌హమ్మద్
కె.కె. మ‌హమ్మద్
శ్యాం ప్రసాద్ ముఖర్జీ
దైత‌రీ నాయ‌క్‌
శాంతను నారాయణ్
దిన్‌యార్ కాంట్రాక్ట‌ర్‌
న‌ర్త‌కి న‌ట‌రాజ్‌
అనూప్ రంజన్ పాండే
జగదీష్ ప్రసాద్ పారిక్
గణపతిభాయ్ పటేల్
బిమల్ పటేల్
హుకుంచంద్ పాటిదార్
హ‌ర్విందర్ సింగ్
మధురై చిన్నా పిళ్ళై
కమలా పుజారి
జగత్ రామ
ఆర్‌.వి.ర‌మ‌ణి
దేవ‌ర‌ప‌ల్లి ప్ర‌కాశ్‌రావు
అనూప్ సాహ్‌
నాగినిదాస్ సాంగ్వి
షబ్బీర్ సయ్యద్
మహేష్ శర్మ
మ‌హమ్మద్ హనిఫ్ ఖాన్ శాస్త్రి
బ్రిజేష్ కుమార్ శుక్లా
నరేంద్ర సింగ్
ప్రశాంతి సింగ్
సుల్తాన్ సింగ్
జ్యోతి కుమార్ సిన్హా
ఆనందన్ శివ‌మ‌ణి
శారద శ్రీనివాసన్
దేవేంద్ర స్వ‌రూప్‌
అజయ్ ఠాకూర్
రాజీవ్ తారానాథ్
సాలుమరద తిమ్మక్క
జమునా తుడు
భ‌రత్ భూషణ్ త్యాగి
రామస్వామి వెంక‌ట‌స్వామి
రామ్ శరణ్ వర్మ
స్వామి విష్ణుదానంద‌
హిరాలాల్ యాదవ్
యడ్లపల్లి వెంకటేశ్వరరావు
Tags:    

Similar News