పద్మరాజన్... ఓట‌మే ఆయ‌న‌ను ఇండియా బుక్‌లోకి ఎక్కించింది !

Update: 2021-04-19 03:49 GMT
ఎక్కడైనా గెలుపు తో రికార్డ్స్ సృష్టించడం ఆనవాయితీ ..బట్ ఫర్ ఏ చేంజ్ ఓటమితో కూడా రికార్డ్స్ సృష్టించవచ్చు అని తాజాగా ఓ వ్యక్తి నిరూపించి చూపించాడు. అయన మరెవరో కాదు .. ఎన్నికల వీరుడు త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన ప‌ద్మరాజ‌న్. పద్మరాజన్ అంటే ఎవరైనా టక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ, ఎన్నికల వీరుడు అంటే ఎవరైనా కూడా ఇట్టే గుర్తు పడతారు. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా అయన నామినేషన్ వేయాల్సిందే. అయన లక్ష్యం గెలుపు కాదు .. పోటీ చేయడం మాత్రమే. 1988 నుంచి ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎలాంటి ఎన్నికలు జరిగినా తొలి నామినేషన్‌ వేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో అయితే సహకార సంఘాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్, రాజ్యసభ ఎన్నికల్లో సైతం నామినేషన్లు వేశారు. ఓ సారి రాష్ట్రపతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ వేశారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచినా, రాజ్యసభ, రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

అలా మొత్తంగా ఇప్పటివరకు పద్మరాజన్‌ ఇప్పటి వరకు 218 సార్లు నామినేషన్లు వేశారు. అయితే వార్డు సభ్యుడిగా కూడా ఆయన ఇంత వరకు గెలవక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా సీఎం పళనిస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్‌కు పోటీగా బ‌రిలోకి దిగారు. దీనితో తాజాగా ఆయ‌న‌కు ఓ ప్ర‌త్యేక గుర్తింపు ల‌భించింది. అయితే ఆ గుర్తింపు గెలిచినందుకు కాదు ఓడి నందుకు. అవును, ప్రతి ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు గాను ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు ప‌ద్మ రాజ‌న్ ‌ను గుర్తించింది. తమ బుక్‌ ఆఫ్‌ రికార్డులో ఆయనకు చోటు కల్పిస్తూ సర్టిఫికెట్‌ ను పంపించారు. దీనిపై అయన మాట్లాడుతూ .. గిన్నిస్ బుక్‌ రికార్డుల్లోకి ఎక్క‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నారు ప‌ద్మ‌రాజ‌న్‌.‌‌


Tags:    

Similar News