మోదీ టార్గెట్ గా పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..!

Update: 2022-12-19 08:32 GMT
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లు తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. తమ దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించడం చేతగాదు గానీ ఎవరైనా తమను ఎమన్న అంటే పాక్ అణ్వస్త్ర దేశమని బెదిరింపు ధోరణిలో మాట్లాడుతుంది. పాక్ లో అభివృద్ధిని గాలికొదిలేసిన నేతలు నిత్యం భారత్ పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకుంటున్నారు.

కాశ్మీర్ కొంత భాగాన్ని ఆక్రమించుకున్న పాక్ అక్కడి నుంచే భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోన్నందనేది అందరికి తెల్సిందే. ప్రశాంతమైన కశ్మీర్ లోకి నిత్యం ఉగ్రవాదులను ఎగదోస్తూ అక్కడి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. భారత సరిహద్దుల్లో నిత్యం కాల్పుల ఉల్లంఘనలకు తెగబడుతూ పాక్ కు మన సైనికులు గట్టిగా జవాబు ఇస్తుండటం అక్కడి నేతలకు మింగుడు పడటం లేదు.

ఈ క్రమంలోనే భారత ప్రధాని మోదీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ టార్గెట్ గా పాక్ పాలకులు నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పాక్ మంత్రి.. అధికార పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేతల షాజియా అణ్వస్త్ర ప్రయోగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమది అణ్వస్త్ర హోదా కలిగిన దేశమని గుర్తు చేశారు.

ఆ హోదా అనేది మౌనంగా ఉండటానికి కాదని భారత్ ను పరోక్షంగా బెదిరించే ధోరణిలో మాట్లాడారు. కాగా పాకిస్తాన్ అణ్వస్త్రాలు కలిగిన బాధ్యతాయుతమైన దేశమని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఉగ్రవాదంపై పోరులో భారత్ కంటే తామే ఎక్కువ త్యాగాలు చేశామని బిలావల్ చేసిన వ్యాఖ్యలను ఆమె సమర్ధించారు.

కాగా ఐరాస వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై 'గుజరాత్ లో ఊచకోతకు కారకుడు' అంటూ మాట్లాడింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీపై అనగారికంగా వ్యక్తిగత దాడికి దిగడం హేయమైన చర్యలు అంటూ ఖండించారు. షాజియా వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ఇటీవల దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News