లిక్కర్ తాగే ఎంపీలకు షాకిచ్చిన పాక్ సెనేటర్లు

Update: 2017-01-14 09:19 GMT
రూల్స్ జనాలకే కాదు.. నేతలకూఉండాలి. తప్పు చేసినప్పుడు ప్రజలకు విధించే శిక్ష కంటే పాలకులకు మరింత పెద్ద శిక్ష విధిస్తే దెబ్బకు దారికి వస్తారన్న చందంగా పాక్ సెనేటర్ ఒకరు చేస్తున్న ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. అవామీ నేషనల్ పార్టీ సెనేటర్ షాహీ సయ్యద్ చేసిన సూచన ఇప్పుడక్కడ హాట్ టాపిక్ గా మారింది.

పాకిస్థాన్ లో మద్యం తాగిన సాధారణ పాక్ పౌరులకు ఆరునెలలు.. ఏడాది జైలుశిక్ష విధిస్తుంటారు. ఇలాంటి వేళ.. పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటేరియన్లకు ఉరిశిక్ష లేదంటే మరణదండన ఎందుకు విధించకూడదంటూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో చేసిన సూచన ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది. గంజాయి.. దార్వేష్ అనే మత్తు పానీయంపైనా బ్యాన్ చేయాలని కోరారు.

రాజకీయ నాయకులు ఎవరైనా సరే.. లిక్కర్.. గంజాయి.. నల్లమందు తీసుకుంటు వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని మరో సెనేటర్ రహమాన్ మాలిక్ చేసిన సూచన వణుకు పుట్టిస్తోంది. పాకిస్థాన్ లో మద్యం అమ్మటంపై నిషేధం విధించినా.. ఇతర మతాల వారికి లైసెన్స్ డ్ మద్యం దుకాణాల ద్వారా అమ్ముతుంటారు. ఇదిలా ఉంటే.. లిక్కర్ తాగే రాజకీయ నాయకులకు మరణశిక్ష విదించాలన్న సూచనరాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News