హత్యకు మించిన నేరం.. ఘోరం ఏమైనా ఉందా? అంటే అత్యాచారమే. చాలామంది ఈ మాటను ఒప్పుకోకపోవచ్చు. కానీ.. లోతుగా ఆలోచిస్తే ఈ మాటలోని నిజాన్ని ఒప్పుకుంటారు. హత్య చేసిన మనిషి ఆనవాళ్లు ఉండదు. మరణించే వేళలో అనుభవించే బాధ తప్పించి ఇంకేం ఉండదు. కానీ.. అత్యాచార బాధితులు మాత్రం బతికినంత కాలం నిత్యం చస్తూ బతకాలి. ఆ గుండె కోతకు ఏం చేసినా తక్కువే. రేప్ లాంటి దారుణ నేరాలకు పాల్పడే వారి విషయంలో కేంద్రం కఠిన చట్టాల్ని తెచ్చినట్లు చెప్పినప్పటికీ.. దేశంలో అత్యాచార పర్వం ఆగట్లేదు. ఇలాంటివేళ.. రేపిస్టుల వెన్ను జలదరించేలా.. రేప్ చేయాలన్న ఆలోచన రావటానికే వణికేలా చట్టాల్ని చేయాల్సిన అవసరాన్ని తరచూ పలువురు ప్రస్తావిస్తుంటారు.
అలాంటి వారి వాదనకు దగ్గరగా తాజాగా పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆ దేశ పార్లమెంటు ఆమోదించిన చట్టం ప్రకారం అత్యాచారాలకు పాల్పడే నిందితులకు కఠినమైన కెమికట్ కాస్ట్రేషన్ కు గురి చేసే చట్టాన్ని ఆమోదించింది. అంటే.. రేప్ చేసిన దోషులకు నపుంశక శిక్షను విధిస్తారు. జీవితంలో లైంగిక జీవితానికి పనికి రాకుండా తయారు చేస్తారు. అత్యాచార నేరాలకు సంబంధించిన కేసుల్ని త్వరగా విచారించటం..నేరస్థులకు కఠినమైన శిక్షలు విధించేలా ఈ చట్టాన్ని ఆమోదించారు.
ఈ శిక్ష అమలు కోర్టు పర్యవేక్షణలో మెడికల్ బోర్డు ఆమోదించిన ఔషధాల ద్వారా నిర్వహిస్తారని చెబుతున్నారు. అయితే.. చట్టాన్ని జమాత్ ఇ ఇస్లామీ సెనేటర్ ముస్తాక్ అహ్మద్ తన నిరసన వ్యక్తం చేశాడు. ఇది ఇస్లాం విరుద్ధమని.. షరియాకు వ్యతిరేకమన్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని బహిరంగంగా ఉరి తీయాలని.. షరియాలో కాస్ట్రేషన్ ప్రస్తావన లేదన్నారు. ఇలాంటి పెద్ద మనషులు గుర్తించాల్సిన సంగతేమంటే.. షరియా రాసే వేళలో.. ఆ ఆలోచన రాకపోవచ్చు. అయినా.. దుర్మార్గులకు విధించే శిక్షల విషయంలో మతాన్ని ప్రస్తావించటం ఏమిటన్నది ప్రశ్న.
ఈ తరహా శిక్షను ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాలు అమలు చేస్తున్నాయి. అత్యాచారాలకు పాల్పడే వారికి దక్షిణ కొరియా.. పోలాండ్.. చెక్రిపబ్లిక్.. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలతో సహా పలు దేశాల్లో ఈ కఠినమైన శిక్షను అమలు చేస్తున్నారు. తాజాగా పాక్ కూడా ఈ శిక్షను అమలు చేయటానికి చట్టాన్నిచేసింది. మరి.. మన దేశంలో ఇలాంటి శిక్ష విధించేలా చట్టాల్సిన అవసరం లేదంటారా? పాలకులు.. ఈ విషయం మీద కాస్తంత ఫోకస్ పెడితే మంచిది.