ప్రపంచమంతా విస్తుపోతోంది. ఎందుకంటే ఆప్ఘనిస్ధాన్లో అధికారాన్ని కబ్జాచేసిన తాలిబన్లకు యావత్ ప్రపంచంలో ఏదైనా మిత్రదేశం ఉందంటే అది పాకిస్ధాన్ మాత్రమే. అలాంటి పాకిస్ధాన్ కూడా తాజాగా తాలిబన్లకు ఓ విషయంలో పెద్ద షాక్ ఇచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే పాకిస్ధాన్-కాబూల్ మధ్య విమాన సర్వీసులను నిలిపేసింది. విమాన టికెట్ల మధ్య పెరిగిపోయిన ధరల విషయంలో ముందుగా తాలిబన్లు పాకిస్ధాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
టికెట్ ధరలు తగ్గించకపోతే ఇబ్బందులు పడతారంటు పాకిస్ధాన్ కు తాలిబన్లు వార్నింగ్ ఇవ్వటం అంతర్జాతీయస్ధాయిలో సంచలనంగా మారింది. ఆఫ్ఘనిస్ధాన్ను తాలిబన్లు ఆక్రమించుకోకముందు ఇస్లామాబాద్ -కాబూల్ మధ్య టికెట్ ధర 120-150 డాలర్లుండేది. అలాంటిది ఇపుడు అదే ధర 2500 డాలర్లకు పెరిగిపోయింది. ఒక్కసారిగా టికెట్ ధర 150 డాలర్ల నుండి 2500 డాలర్లకు పెరిపోవటంతో రెండు దేశాల్లోని ప్రయాణీకులకు చాలా ఇబ్బందిగా మారింది.
పాకిస్ధాన్-తాలిబన్ల మధ్య మంచి సంబంధాలుండటంతో విమానాల్లో రెగ్యులర్ గా ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా బాగా ఎక్కువగానే ఉంటోంది. ఎప్పుడైతే టికెట్ ధరలు విపరీతంగా పెరిగిపోయిందో వెంటనే తాలిబన్లు పాకిస్ధాన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. వెంటనే టికెట్ ధరలు తగ్గించకపోతే పరిణామాలు సీరియస్ గా ఉంటాయంటు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం అంతర్జాతీయంగా వైరల్ అవటంతో మిగితా దేశాల ముందు పాకిస్ధాన్ పరువు కాస్తపోయింది.
దీంతో అర్జటుగా డ్యామేకి కంట్రోలు చేయాలని అనుకున్న పాకిస్ధాన్ ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా ఏకంగా కాబూల్ కు తమ విమానసర్వీసులను నిలిపేసింది. తమ అంతర్గత విషయాల్లో తాలిబన్లు జోక్యం చేసుకోవటం, పైగా ప్రపంచ వ్యాప్తంగా తాలిబన్ల వల్ల తమకు పరువుపోవటాన్ని పాకిస్ధాన్ చాలా సీరియస్ గా తీసుకుంది. అసలు టికెట్ ధరలు అంతగా ఎందుకు ఒక్కసారిగి పెరిగిపోయాయి ?
ఎందుకంటే కాబూల్ ను బీమా సంస్ధలు యుద్ధ ప్రాంతంగా పరిగణిస్తున్నాయి. మరి యద్ధ ప్రాంతానికి విమాన సర్వీసులను నడపటానికి ఏ సంస్ధ ధైర్యం చేస్తుంది ? ఎంత యుద్ధప్రాంతమైనా ట్రాఫిక్ ఉన్న కారణంగా సర్వీసులు నడపటం తప్పలేదు కాబట్టే ఇన్సూరెన్స్ ప్రీమియంను బీమా సంస్ధలు బాగా పెంచేశాయి. ఎప్పుడైతే ప్రీమియం ధరలు బాగా పెరిగిపోయాయో దాని ఆధారంగా టికెట్ ధరలు కూడా పెరిగిపోయాయి.
అయితే ఈ విషయాలను పరిగణలోకి తీసుకోని తాలిబన్లు టికెట్ ధరలు తగ్గించాల్సిందే అంటు అల్టిమేటమ్ ఇవ్వటంతోనే పాకిస్ధాన్ కు మండిపోయింది. సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని వార్నింగ్ ఇవ్వటం ద్వారా తమ పరువు తీసేశారన్న మంటతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కాబూల్ కు పాకిస్తాన్ విమాన సర్వీసులను నిలిపేసింది. దాంతో ఆఫ్ఘన్ కున్న ఒక్క విమాన సర్వీసు కూడా నిలిచిపోయింది. దాంతో ఇపుడు తాలిబన్లు షాక్ తగినట్లుగా ఫీలవుతున్నారట.