చైనా దోస్త్ పాకిస్తాన్ కూడా టిక్ టాక్ పై నిషేధం

Update: 2020-10-09 17:33 GMT
భారత్ , అమెరికాతో కయ్యానికి కాలుదువ్విన టిక్ టాక్ పై ఈ రెండు దేశాలు నిషేధం విధించి చైనాకు షాక్ ఇచ్చాయి. ఆ దేశ యాప్ లన్నింటిపై భారత్ నిషేధం విధించింది. అయితే చైనాకు మిత్రదేశమైన పాకిస్తాన్ కూడా తాజాగా చైనాకు షాకిచ్చే నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

వీడియో షేరింగ్ అప్లికేషన్ లో అనైతిక, అసభ్యకరమైన కంటెంట్ పై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ ఈ చైనా దేశపు టిక్ టాక్ యాప్ ను నిషేధించింది.

చట్టవిరుద్ధమైన ఆన్ లైన్ కంటెంట్ నియంత్రణ కోసం సమర్థవంతమైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడంలో టిక్ టాక్ విఫలమైందని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ ఆథారిటీ (పీటీఏ) పేర్కొంది. సమాజంలోని వివిధ వర్గాల నుంచి అనేక ఫిర్యాదులను స్వీకరించిన తరువాత ఈ చర్య తీసుకున్నట్లు పీటీఏ తెలిపింది.

ఈ యాప్ లో ప్రజలు ఇచ్చే సమాచారానికి భద్రత లేని కారణంగా భారతదేశం కూడా ఈ టిక్ టాక్ యాప్ ను ఇటీవలే నిషేధించింది. అమెరికా కూడా ఈ అప్లికేషన్ ను బ్యాన్ చేసేందుకు రెడీగా ఉంది.
Tags:    

Similar News