ఉరిశిక్షపై నిషేధం ఉన్న పాకిస్థాన్‌లో ఈ మధ్యనే దానిపై నిషేధాన్ని ఎత్తేశారు. తీవ్రవాద కార్యకలాపాల మీద చూసీ చూడనట్లుగా వ్యవహరించిన పాక్‌కు.. ఇప్పుడు వారి తీరు దేశానికే ప్రమాదకరంగా మారటంతో వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు.
తీవ్రవాద నేరాలపై అరెస్ట్ అయి.. ఉరిశిక్ష పడిన వారిని ఉరి తీసేందుకు పాక్ సర్కారు ఏ మాత్రం ఆలోచించటం లేదు. పాక్‌ను అల్లకల్లోలం చేస్తున్న తీవ్రవాదుల విషయంలో ఎలాంటి మొహమాటాలకు పోకూడదని.. నిక్కచ్చిగా వ్యవహరించాలన్న ధోరణి పాక్‌లో కనిపిస్తోంది. పాక్ సరిహద్దుల్లో శిక్షణ తీసుకొని.. మారణహోమం సృష్టిస్తున్న తీవ్రవాదుల చర్యలపై పాక్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇటీవల రెండు చర్చిలపై ఆత్మాహుతి దాడులకు తెగబడిన ఉదంతంలో.. ఈ ఘటనకు అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరిని పట్టుకొని సజీవ దహనం చేసిన ఘటన అక్కడి ప్రజల్లో ఉగ్రవాదుల పట్ల ఉన్న ఆగ్రహాన్ని ఇట్టే తెలియజేస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రజల్లో పెల్లుబికుతున్న ఆగ్రహానికి తగ్గట్లే ఉగ్రవాదుల విషయంలో పాక్ సర్కారు కఠినంగా వ్యవహరిస్తోంది. ఉగ్రవాదం.. హత్యా నేరాల కింద ఉరిశిక్ష పడ్డ వారిలో పన్నెండు మందిని ఒకే రోజు పాక్‌లోని వివిధ జైళ్లలో ఉరి తీయటం గమనార్హం.
ఇంత భారీ స్థాయిలో ఒకేరోజు ఉరిశిక్ష అమలు కావటం ఇదే తొలిసారి అని అంటున్నారు. ఉరిపై నిషేధం ఎత్తేసిన తర్వాత ఇప్పటివరకూ 39 మందిని ఉరితీశారు. ఉరిశిక్షను అమలు పర్చిన జైళ్లు పాక్‌లోని పలు నగరాలకు చెందినవిగా ఉన్నాయి.