మసూద్ అజార్ ను విడుదల చేసి విషం కక్కిన దాయాది

Update: 2019-09-09 07:12 GMT
జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 నిర్వీర్యం చేస్తూ మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం తర్వాత నుంచి అదే పనిగా రగిలిపోతోంది పాకిస్తాన్. జమ్ముకశ్మీర్ లో వేలు పెట్టేందుకు అవకాశం ఇవ్వని రీతిలో మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవటం..ఇప్పటివరకూ భారత దేశ  ప్రధానులుగా పని చేసిన వారెవరూ చేయని రీతిలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ విషయంపై మోడీ సూటిగా మాట్లాడటం.. ఆయన ప్రభుత్వంలోని మంత్రులు అయితే మరో అడుగు ముందుకేసి.. పీవోకే తమదేనన్న వాదనను వినిపించటమే కాదు.. ఏదో ఒక రోజు అది భారత్ లో కలిసిపోవటం ఖాయమన్న వ్యాఖ్యల్ని చేస్తున్నారు.

ఈ పరిణామాల్నిజీర్ణించుకోలేకపోతున్న పాకిస్తాన్.. అదే పనిగా తన అక్కుసును అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించటం.. పలుమార్లు భంగపడటం తెలిసిందే. భారత్ మీద అదే పనిగా విషం కక్కుతున్న పాక్ కు.. వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నా బుద్ధి రావటం లేదు సరికదా.. మరింతగా చెలరేగిపోతున్నట్లుగా వ్యవహరిస్తోంది.

తాజాగా అలాంటి తీరును మరోసారి ప్రదర్శించింది దాయాది. పాక్ జైల్లో ఉన్న కరడుగట్టిన తీవ్రవాది.. జేషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ ను విడుదల చేస్తూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సమాచారం నిఘా వ్యవస్థ ద్వారా భారత్ కు అందింది. భారత్ మీద విషం కక్కే మసూద్ ను విడుదల చేయటం ద్వారా.. దేశంలో దారుణ ఘటనలకు ప్లాన్ చేసేందుకు అవకాశం ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.

ఇటీవల మీడియాతో మాట్లాడిన జాతీయ భద్రతా మండలి చీఫ్ దోవల్.. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వందలాది మంది ఉగ్రవాదుల్ని దేశంలోకి పంపేందుకు వీలుగా పాక్ కుట్రలు చేస్తున్నట్లుగా ఆరోపించారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఇమ్రాన్ ప్రభుత్వం మసూద్ ను విడుదల చేయాలని నిర్ణయించిందని చెప్పాలి. భారత్ లో పలు ఉగ్ర దారుణాలకు కారణమైన మసూద్ ను విడుదల చేయటం ద్వారా.. భారత్ లో కల్లోలాలకు పురికొల్పినట్లుగా పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News