టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు పాకిస్తాన్.. సెమీస్ లో కివీస్ చిత్తు.. టీమిండియాతో ఫైనల్ కు ఛాన్స్?

Update: 2022-11-09 12:15 GMT
టీ20 వరల్డ్ కప్ లో  వరుసగా తొలి రెండు  ఓటములతో అసలు సెమీస్ కూడా చేరుతుందో లేదోనని అందరూ తిట్టిపోసిన పాకిస్తాన్ అద్భుతమే చేసింది. ఏకంగా ఫైనల్ చేసి సత్తా చాటింది. తిట్టిన నోళ్లతోనే పొగిడించుకుంది. దక్షిణాఫ్రికా అనూహ్య పరాజయంతో ఊపిరిపోసుకున్న పాకిస్తాన్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడించి సెమీస్ లోకి అడుగుపెట్టింది.

ఇక తొలి మ్యాచ్ లోనే ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించి ఆ జట్టును ఇంటికి పంపి వరుస విజయాలు సాధించిన బలమైన న్యూజిలాండ్ ను ఈజీగా సెమీస్ లో ఓడించిన పాకిస్తాన్ కొత్త చరిత్రను లిఖించింది. ఏకంగా టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ చేరింది.

టీ20 వరల్డ్ కప్ లో ఈరోజు జరిగిన తొలి సెమీస్ లో న్యూజిలాండ్ ను సునాయాసంగా ఓడించిన పాకిస్తాన్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఏకంగా సెమీస్ లో న్యూజిలాండ్ పై 7 వికెట్ల తేడాతో ఘనవి జయం సాధించింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ పాక్ బౌలర్ల ధాటికి ఏ దశలోనూ పరుగులు చేయలేకపోయింది. తడబడింది. 152 పరుగులకే పరిమితమైంది. 153 పరుగుల  లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కు ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ లు బలమైన పునాదం వేశారు. ఇద్దరూ ఆఫ్ సెంచరీలతో చెలరేగడంతో  153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరో 5 బంతులు మిగిలి ఉండగానే విక్టరీ సొంతం చేసుకుంది.  కెప్టెన్ బాబర్ అజామ్ (53), రిజ్వాన్ (57) పరుగులు చేసి పాకిస్తాన్ విజయానికి బాటలు వేశారు.

2007 తొలి టీ20 వరల్డ్ కప్ లోనూ ఇదేజరిగింది. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించిన ధోని సారథ్యంలోని టీమిండియా.. ఫైనల్ లోనూ ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఇప్పుడు కూడా తొలి మ్యాచ్ లో పాక్ ను ఓడించిన టీమిండియా సెమీస్ లో ఇంగ్లండ్ ను ఓడిస్తే ఫైనల్ లో పాక్ ను ఎదుర్కొంటుంది. అక్కడ గెలిస్తే విశ్వవిజేతగా నిలవడం విశేషం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News